Suma Kanakala : వామ్మో.. వాయ్యో.. సుమ ఫోటో షూట్‌పై రాజీవ్ కనకాల రియాక్షన్

టీవీ షోలు.. సినిమా వేడుకలలో హోస్ట్ చేస్తూ బిజీగా ఉన్న సుమ రీసెంట్‌గా ఓ ఫోటో షూట్ చేసారు. ఆ ఫోటో షూట్ చూసిన రాజీవ్ కనకాల రియాక్షన్ మామూలుగా లేదు.

Suma Kanakala

Suma Kanakala : రాజీవ్ కనకాల-సుమ కనకాల భార్యాభర్తలిద్దరూ వారి వారి ఫీల్డ్స్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవల వారి కుమారుడు రోషన్ కూడా ‘బబుల్ గమ్’ సినిమాతో హీరోగా అరంగేట్రం చేసి మంచి మార్కులే కొట్టేశారు. విషయం ఏంటంటే తాజాగా సుమ ఓ ఫోటో షూట్ చూసారు. ఇక దానిని చూసిన రాజీవ్ మామూలుగా రియాక్ట్ కాలేదు. సుమ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Ananya Pandey : బ్లాక్ అవుట్ ఫిట్ అందాలతో బాప్ రే అనిపిస్తున్న అనన్య పాండే..

యాంకర్ సుమ ఆన్ స్క్రీన్ అనే కాదు బయట కూడా చాలా సరదాగా ఉంటారు. నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు. ఆమె ఎక్కడ ఉన్నా ఆ వాతావరణం సందడిగా మారిపోతుంది. టీవీ షోలు, సినిమా ఈవెంట్లతో బిజీగా ఉన్నారు సుమ. ఆమె భర్త రాజీవ్ కూడా సినిమాలతో బిజీగానే ఉన్నారు. ఇటీవలే కొడుకు రోషన్ ‘బబుల్ గమ్’ సినిమాతో హీరో అయ్యారు. సినిమా ఫర్వాలేదు అనిపించింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం సుమ కూడా చాలానే కష్టపడ్డారు. ప్రమోషన్స్‌లో భాగంగా వేసుకున్న డ్రెస్‌తో రీసెంట్‌గా ఓ ఫోటో షూట్ చేసారు సుమ. ఆ ఫోటో షూట్ చూసి తన భర్త రాజీవ్ ఎలా రియాక్ట్ అయ్యారో చూడండి అంటూ సోషల్ మీడియాలో ఆ వీడియోను షేర్ చేసారు.

Mahesh Babu : రికార్డులతోనే రికార్డులు క్రియేట్ చేస్తున్న మహేష్ బాబు.. అవేంటో తెలుసా..?

బ్లాక్ కలర్ డ్రెస్ లో బ్లాక్ కళ్లద్దాలు పెట్టుకుని ఫన్‌‌గా సుమ చేసిన ఫోటో షూట్ చూసి రాజీవ్ ‘వామ్మో.. వాయ్యో’ అని వణికిపోతున్నట్లు ఇచ్చిన రియాక్షన్ నవ్వు తెప్పించింది. నెటిజన్లు మాత్రం రాజీవ్ రియాక్షన్ సూపర్.. రాజీవ్ గారు మాకు కాళ్లు.. చేతులు వణుకుతున్నాయ్ అంటూ సరదా కామెంట్లు చేసారు. రోజు రోజుకి నీ వయసు తగ్గిపోతోంది సుమ అక్కా అంటూ కాంప్లిమెంట్లు ఇచ్చారు. నిజంగానే ఫోటో షూట్‌లో సుమ అదరహో అనిపించారు.