Mahesh Babu : రికార్డులతోనే రికార్డులు క్రియేట్ చేస్తున్న మహేష్ బాబు.. అవేంటో తెలుసా..?

మహేష్ బాబు కేవలం ఒక్క భాషలో సినిమాలు తీసుకొచ్చి కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు.

Mahesh Babu : రికార్డులతోనే రికార్డులు క్రియేట్ చేస్తున్న మహేష్ బాబు.. అవేంటో తెలుసా..?

super star Mahesh Babu creating records with guntur kaaram movie

Updated On : January 17, 2024 / 9:47 PM IST

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు రికార్డులతోనే మరో రికార్డు సృష్టిస్తున్నారు. మహేష్ నటించిన తాజా చిత్రం గుంటూరు కారం ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది. రీజినల్ సినిమాగా వచ్చిన ఈ మూవీ కేవలం తెలుగులోనే రిలీజ్ అయ్యి ఇప్పటివరకు 175 కోట్లకు పైగా రాబట్టినట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో 200 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకొని 100 కోట్ల షేర్ ని సెట్ చేయడం ఖాయం.

ఇలా మహేష్ బాబు 200 కోట్ల గ్రాస్ ని అందుకొని 100 కోట్ల షేర్ ని రాబట్టిన సినిమాలు ఏకంగా ఐదు ఉన్నాయి. ‘భారత్ అనే నేను’ సినిమా నుంచి మొదలు పెడితే వరుసగా ఐదు సినిమాలతో 100 కోట్ల షేర్ ని అందుకున్నారు. ‘భారత్ అనే నేను’ చిత్రానికి దాదాపు 225 కోట్ల గ్రాస్ వచ్చింది. అంటే దాదాపు 110 కోట్ల షేర్ వచ్చినట్లు. ఆ తరువాత వచ్చిన ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరూ’ మూవీస్ కూడా 100 కోట్ల షేర్ ని అందుకున్నాయి.

Also read : Tollywood : రిపబ్లిక్ డేకి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద డబ్బింగ్ సినిమాల ఫైట్..

ఇక 2022లో వచ్చిన ‘సర్కారు వారి పాట’ సినిమా 230 కోట్ల గ్రాస్ ని రాబట్టి మహేష్ రికార్డుని అలా కొనసాగించింది. ఇప్పుడు ఆ పరంపరని మరింత ముందుకు తీసుకు వెళ్ళడానికి గుంటూరు కారం కూడా సిద్ధమైంది. ఈ చిత్రాలు అన్ని కేవలం ఒక్క బాషలోనే రిలీజ్ అయ్యినవి. ఇలా ఒక్క భాషలో రిలీజ్ అయ్యి వరుసగా ఐదుసార్లు 100 కోట్ల షేర్ రాబట్టడం.. మహేష్ మ్యానియాకే సాధ్యమైంది.

అయితే ఈ రికార్డు ఇక్కడితోనే ఆగిపోయేలా కనిపిస్తుంది. ఎందుకంటే మహేష్ తన తదుపరి సినిమాని రాజమౌళితో చేస్తున్న సంగతి తెలిసిందే. అది పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ కాబోతుంది. ఇక ఆ చిత్రం తరువాత తాను మళ్ళీ తెలుగు రీజినల్ సినిమా చేయకపోవచ్చు అంటూ మహేష్ ఇటీవల వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ రీజినల్ సినిమాల 100 కోట్ల షేర్ పరంపరకి గుంటూరు కారంతో ముగింపు పడబోతుందని తెలుస్తుంది.