Tollywood : రిపబ్లిక్ డేకి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద డబ్బింగ్ సినిమాల ఫైట్..
సంక్రాంతి పోటీ అయ్యిపోయింది. ఇప్పుడు రిపబ్లిక్ డే ఫైట్. అయితే ఈ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వార్ లో డబ్బింగ్ సినిమాల ఫైట్..

Captain Miller Ayalaan Fighter movie release dates and trailers
Captain Miller – Ayalaan : తమిళ్ హీరోలు ధనుష్, శివ కార్తికేయన్ ఈ సంక్రాంతికి ‘కెప్టెన్ మిల్లర్’, ‘అయలాన్’ సినిమాలతో వచ్చారు. అయితే తెలుగులో ఈ పండక్కి సినిమాల సందడి ఎక్కువ ఉండడంతో థియేటర్స్ దొరక్క.. ఈ తమిళ సినిమాలు తెలుగులో రిలీజ్ కాలేకపోయాయి. కేవలం తమిళంలో మాత్రమే ఈ రెండు చిత్రాలు రిలీజ్ అయ్యి మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి.
శివ కార్తికేయన్ నటించిన సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘అయలాన్’ కథ ఏలియన్ చుట్టూ తిరగనుంది. ఆర్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. ఆల్రెడీ ఈ మూవీ తెలుగు ట్రైలర్ ని గతంలోనే రిలీజ్ చేశారు. ఏలియన్ తో కామెడీ చేయిస్తూ.. మెసేజ్ ఓరియెంటెడ్ గా ఈ సినిమా రాబోతుంది. మరి ఆ ట్రైలర్ ని మీరు కూడా చూసేయండి.
Also read : RajaSaab : ప్రభాస్ ‘రాజాసాబ్’ కథ అదేనంటూ IMDb.. కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్ మారుతీ..
ఇక ధనుష్ నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో తెరకెక్కింది. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా, శివ రాజ్ కుమార్, సందీప్ కిషన్ ముఖ్య పాత్రలు చేశారు. ఈ మూవీ తెలుగు ట్రైలర్ ని ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. నేడు అక్కినేని నాగార్జున చేతులు మీదుగా తెలుగు ట్రైలర్ ని లాంచ్ చేశారు. ఆ ట్రైలర్ వైపు కూడా ఓ లుక్ వేసేయండి.
ఈ రెండు చిత్రాలు జనవరి 25న రిపబ్లిక్ డే సందర్భంగా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. అయితే అదే రోజు హృతిక్ రోషన్ ‘ఫైటర్’ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. బ్యాంగ్ బ్యాంగ్, వార్ తరువాత దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్, హృతిక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై మంచి అంచనాలే నెలకొన్నాయి.
దీంతో రిపబ్లిక్ డేకి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద డబ్బింగ్ సినిమాల ఫైట్ కనిపించబోతుంది. మరి ఈ మూడు చిత్రాల్లో ఏది సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి. అయలాన్, కెప్టెన్ మిల్లర్ చిత్రాలకు ఆల్రెడీ తమిళంలో హిట్ టాక్ రావడంతో ఆడియన్స్ లో కొంచెం పాజిటివ్ టాక్ ఉంది.