RajaSaab : ప్రభాస్ ‘రాజాసాబ్’ కథ అదేనంటూ IMDb.. కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్ మారుతీ..

ప్రభాస్ 'రాజాసాబ్' కథ అదేనంటూ IMDb డిస్క్రిప్షన్. అరెరే నాకు ఇది తెలియక అంటూ కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్ మారుతీ.

RajaSaab : ప్రభాస్ ‘రాజాసాబ్’ కథ అదేనంటూ IMDb.. కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్ మారుతీ..

IMDb description about Prabhas RajaSaab movie story director Maruthi counter

Updated On : January 17, 2024 / 5:55 PM IST

RajaSaab : మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘రాజాసాబ్’. ఎప్పుడో షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ ప్రాజెక్ట్ రీసెంట్ గానే అధికారికాక ప్రకటనతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇక ఈ సంక్రాంతి కానుకగా ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్ ని చూపించి ఫ్యాన్స్ ని ఖుషీ చేయబోతున్నారు. కాగా ఈ మూవీ స్టోరీ గురించి అనేక లైన్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

ఈక్రమంలోనే ప్రముఖ మూవీ రేటింగ్ వెబ్‌సైట్ IMDb.. ‘రాజాసాబ్’ మూవీ స్టోరీ లైన్ గురించి ఒక డిస్క్రిప్షన్ పెట్టింది. అదేంటంటే.. “ఈ సినిమా కథ ఒక కపుల్ చుట్టూ తిరుగుతుందట. ప్రేమలో పడిన ఇద్దరి వ్యక్తుల డెస్టినీ నెగటివ్ ఎనర్జీ వల్ల వేరే దారి మళ్లుతుందని” పేర్కొంది. ఇక దీని పై మారుతీ రియాక్ట్ అవుతూ IMDb గట్టి కౌంటర్ ఇచ్చారు. మారుతీ రిప్లై చూస్తే మీరు తప్పకుండా నవ్వుతారు.

Also read : Mahesh Babu : ‘గుంటూరు కారం’ సెట్స్‌లో డాన్సర్స్‌కి మహేష్ ఫొటోలు.. ఆల్మోస్ట్ వందమంది వరకు..

మారుతీ కౌంటర్ ఏంటంటే.. “అరెరే నాకు ఇది తెలియక, వేరే స్క్రిప్ట్ తో సినిమా షూట్ చేస్తున్నానే. మరి ఈ కథని IMDb సమాజం అంగీకరిస్తుందా..?” అంటూ తనదైన స్టైల్ లో బదులిచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కాగా ఈ మూవీ హారర్ బ్యాక్ డ్రాప్ తో సాగుతుందని మూవీ టీం ఇప్పటికే తెలియజేసింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర చాలా ఎంటర్టైన్ గా ఉంటుందని పేర్కొన్నారు.

 

View this post on Instagram

 

A post shared by CELLULOID PANDA (@celluloid_panda)

బాహుబలి తరువాత నుంచి వింటేజ్ ప్రభాస్ ని మిస్ అవుతున్న ఫ్యాన్స్.. డార్లింగ్ నుంచి మంచి ఫన్ మూవీని కోరుకుంటున్నారు. ఈ చిత్రం అలాగే ఉండబోతుందని మారుతీ తెలియజేశారు. అలాగే ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ కి తగ్గట్టు ఈ సినిమా ఉంటుందని పేర్కొంటున్నారు. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి 50 శాతం షూటింగ్ పూర్తీ అయ్యింది. ప్రభాస్ కల్కి షూటింగ్ పూర్తి అయిన తరువాత ఈ మూవీ షూటింగ్ ని మొదలుపెట్టనున్నారు.