Mahesh Babu : ‘గుంటూరు కారం’ సెట్స్‌లో డాన్సర్స్‌కి మహేష్ ఫొటోలు.. ఆల్మోస్ట్ వందమంది వరకు..

'గుంటూరు కారం' సెట్స్‌లో డాన్సర్స్‌కి మహేష్ బాబు ఓపికతో ఫొటోలు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో..

Mahesh Babu : ‘గుంటూరు కారం’ సెట్స్‌లో డాన్సర్స్‌కి మహేష్ ఫొటోలు.. ఆల్మోస్ట్ వందమంది వరకు..

Mahesh Babu photos for dancers in Guntur Kaaram movie sets

Updated On : January 17, 2024 / 4:37 PM IST

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తుంది. ‘రమణ గాడు’ అంటూ మహేష్ చూపించిన మాస్ అభిమానులను విజుల్స్ వేసేలా చేస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని మహేష్ డాన్స్ తో ఆడియన్స్ కి పూనకాలు వస్తున్నాయి. మొదటి సాంగ్ ‘దమ్ మసాలా’, చివరి సాంగ్ ‘కుర్చీ మడతపెట్టి’ పాటలకు మహేష్ వేసిన స్టెప్పులకు థియేటర్స్ బాక్స్ లు బద్దలయ్యిపోయాయి.

ఇక ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తుంటే, ఈ మూవీ షూటింగ్ సెట్స్ కి సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఈక్రమంలోనే మొదటి సాంగ్ ‘దమ్ మసాలా’ షూటింగ్ సమయంలో ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో మహేష్.. సాంగ్ షూటింగ్ లో పాల్గొన్న డాన్సర్స్ కి ఫొటోలు ఇచ్చారు. వారితో పాటు ఫోటో దిగి వారిని సంతోష పరిచారు. ఆల్మోస్ట్ వందమంది వరకు మహేష్ ఓపికగా ఫొటోలు ఇచ్చారని చెబుతున్నారు.

Also read : Sreeleela : మహేష్‌తో సినిమా చేస్తుందని తెలిసి.. ముంబైలోని కాలేజీ శ్రీలీలకి ఎక్స్‌ట్రా మార్కులు వేశారట..

 

View this post on Instagram

 

A post shared by _kallu??? (@nainika_kalyani)

కాగా ఈ సినిమా మొదలు పెట్టేముందే మహేష్, త్రివిక్రమ్.. ఈ మూవీలో ఓ రెండు పాటలకు గట్టిగా డాన్స్ ప్లాన్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఎందుకంటే ఈ సినిమా తరువాత మహేష్ రాజమౌళితో సినిమా చేస్తారు. అందులో తెలుగు కమర్షియల్ సాంగ్ ఉండకపోవచ్చు. ఇక ఆ చిత్రం తరువాత మహేష్ మళ్ళీ తెలుగు కమర్షియల్ సినిమా చేయకపోవచ్చు. అందుకనే ఈ సినిమాలో అభిమానుల కోసం మాస్ డాన్స్ తో పూనకాలు తెప్పించాలని భావించారు.

అనుకున్నట్లే సాంగ్స్, కొన్ని మ్యూజికల్ బిట్స్ తో మహేష్ తన ఫ్యాన్స్ ని ఉర్రుతలూగించారు. మహేష్ తో కలిసి శ్రీలీల కూడా అదరహో అనిపించారు. ఇక ఈ మూవీ కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు 175 కోట్లకు పైగా రాబట్టినట్లు సమాచారం. మరో 10 రోజులు వరకు పెద్దగా సినిమా రిలీజ్‌లు లేవు. కాబట్టి 200 కోట్ల కలెక్షన్స్ రాబట్టడం పెద్ద సమస్య ఏమీ కాదు. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే 130 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు 270 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టాలి.