Sreeleela : మహేష్‌తో సినిమా చేస్తుందని తెలిసి.. ముంబైలోని కాలేజీ శ్రీలీలకి ఎక్స్‌ట్రా మార్కులు వేశారట..

మహేష్‌తో సినిమా చేస్తుందని తెలిసి ముంబైలోని కాలేజీ ప్రొఫెసర్స్ శ్రీలీలకి ఎక్స్‌ట్రా మార్కులు వేశారట.

Sreeleela : మహేష్‌తో సినిమా చేస్తుందని తెలిసి.. ముంబైలోని కాలేజీ శ్రీలీలకి ఎక్స్‌ట్రా మార్కులు వేశారట..

Sreeleela said she got extra marks in studies because of Mahesh Babu craze

Updated On : January 17, 2024 / 3:43 PM IST

Sreeleela : టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల విజయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకు పోతున్నారు. తాజాగా ఈ హీరోయిన్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ తో కలిసి శ్రీలీల అదిరే డాన్సులు చేసి ప్రేక్షకులను ఫిదా చేశారు. ప్రస్తుతం ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద తన జోరుని కొనసాగిస్తుంది.

ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా శ్రీలీల, మహేష్ కలిసి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో శ్రీలీల తన స్టడీస్ కి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని తెలియజేశారు. శ్రీలీల ఇటు సినిమాల్లో నటిస్తూనే.. మరోపక్క ఎంబిబిఎస్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే కొన్ని ఎగ్జామ్స్ కి కూడా అటెండ్ అయ్యారు. ఈక్రమంలోనే ముంబైలో ఎంబిబిఎస్ ఎగ్జామ్స్ కి అటెండ్ అయ్యినప్పుడు వైవాని కూడా ఫేస్ చేశారు.

Also read : Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఇచ్చిన మాట నెరవేరుస్తాడా?

ఆ వైవా అడిగే వారికీ శ్రీలీల, మహేష్ బాబుతో సినిమా చేస్తున్నట్లు తెలిసి.. వైవాలో ఆమెకు కొన్ని ఎక్స్‌ట్రా మార్కులు వేశారట. ఈ విషయాన్ని శ్రీలీల స్వయంగా తెలియజేశారు. అలాగే గుంటూరు కారం మూవీకి ముంబై థియేటర్స్ లో వస్తున్న క్రేజ్ కూడా చూసి ఆశ్చర్యపోయినట్లు శ్రీలీల పేర్కొన్నారు. అక్కడి థియేటర్స్ లో మహేష్ బాబు ఎంట్రీకి పేపర్స్ ఎగరేయడం, సందడి చేయడం వావ్ అనిపించినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ప్రస్తుతం ఈ మూవీ కలెక్షన్స్ విషయానికి వస్తే.. 175 కోట్లకు పైగా రాబట్టినట్లు సమాచారం. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే 130 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు 270 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టాలి. ఇప్పుడు వచ్చిన కలెక్షన్స్ బట్టి చూస్తే.. ఈ చిత్రం మరో 100 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టాల్సి ఉంది. మరో 10 రోజులు వరకు పెద్దగా సినిమా రిలీజ్‌లు ఏమీ లేవు. కాబట్టి ఈ కలెక్షన్స్ రాబట్టడం పెద్ద సమస్య ఏమీ కాదు.