Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఇచ్చిన మాట నెరవేరుస్తాడా?
ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలు చేస్తానంటూ గతంలో డార్లింగ్ ప్రభాస్ అభిమానులకు మాట ఇచ్చారు. మరి ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటారా?

Prabhas
Prabhas : ప్రభాస్ ఏడాదికి 2 లేదా మూడు సినిమాలు చేస్తానని గతంలో అభిమానులకు మాట ఇచ్చారు. 2023 లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రెబెల్ స్టార్ ఇకపైన కూడా ఇదే పంథాలో కొనసాగుతారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
HanuMan : బాలయ్యకి ‘హనుమాన్’ స్పెషల్ ప్రీమియర్.. సెకండ్ పార్ట్ కోసం..
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా ట్రైలర్ తిరుపతిలో రిలీజ్ చేసిన సందర్భంలో అభిమానులకు ఒక ప్రామిస్ చేసారు. ఇకపై ఏడాదికి 2 లేదా.. మూడు సినిమాలు చేస్తానంటూ మాట ఇచ్చారు. 2023 లో ఆదిపురుష్, సలార్ సినిమాలు చేసి ప్రభాస్ మాట నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం భారీ ప్రాజెక్టులతో కమిట్ అయి ఉన్న ప్రభాస్ ఇదే పంథాలో సినిమాలు కంప్లీట్ చేస్తారా? అనేది అభిమానుల ముందున్న ప్రశ్న.
సలార్ తర్వాత ప్రభాస్ చేస్తున్న మూవీ కల్కి 2898AD. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మే 9న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ చెబుతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్-మారుతి కాంబోలో వస్తున్న మూవీ ‘ది రాజా సాబ్’ ఆల్రెడీ షూటింగ్ మొదలైంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో వస్తున్న ఈ మూవీ రొమాంటిక్ హర్రర్ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది.
ఈ ప్రాజెక్టులతో పాటు ప్రభాస్-హను రాఘవపూడి సినిమా, సందీప్ రెడ్డి ‘స్పిరిట్’ షూటింగ్స్ మొదలవ్వాల్సి ఉంది. ఇక ‘సలార్ పార్ట్ 2’ కూడా పెండింగ్ ఉంది. మొత్తానికి ప్రభాస్ చేస్తున్న భారీ ప్రాజెక్టుల్లో 2025 నాటికి కనీసం 2 సినిమాలైనా విడుదలకు నోచుకుంటే ఆయన అభిమానులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లే.