Rajeev Kanakala : ఫుడ్ పాయిజన్ కావడంతో.. రాజీవ్ కనకాల అలా..

రాజీవ్ కనకాల ఈ మధ్య కాలంలో కాస్త లావయ్యారు. అందుకు కారణమేంటో మీడియాతో షేర్ చేసుకున్నారు.

Rajeev Kanakala

Rajeev Kanakala : రాజీవ్ కనకాల నటుడిగా.. సుమ భర్తగా అందరికి సుపరిచితమే. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వరుసపెట్టి సినిమాలు చేస్తున్న రాజీవ్ ఈ మధ్య బాగా లావయ్యారు. అందుకు కారణాలు ఏంటో రాజీవ్  మీడియాతో షేర్ చేసుకున్నారు.

Eagle Movie : మారింది తేదీ మాత్రమే మాసోడి మార్క్ కాదు.. సంక్రాంతి నుంచి ఈగల్ తప్పుకోవడంపై స్పందించిన రవితేజ..

టీవీ స్క్రీన్‌తో కెరియర్ మొదలుపెట్టి బిగ్ స్క్రీన్‌పై నాన్ స్టాప్‌గా సినిమాలు చేస్తున్నారు రాజీవ్ కనకాల. రాంబంటు సినిమాతో మొదలైన ఆయన ప్రయాణం స్టూడెంట్ నంబర్ 1, ఆది, నువ్వే నువ్వే, నాగ, ఫిల్మ్ బై అరవింద్, మీనాక్షి, యమదొంగ, సరిలేరు నీకెవ్వరు, పెదకాపు 1 ఇలా చాలానే సినిమాల్లో నటించారు. ఇటీవలే రాజీవ్-సుమ దంపతుల కొడుకు రోషన్ కూడా ‘బబుల్ గమ్’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమా రిలీజ్‌కి ముందు పలు ఫంక్షన్లలో కనిపించిన రాజీవ్ కనకాల గతంలో కంటే బాగా లావైనట్లు కనిపించారు. అందుకు కారణాలు ఏంటో మీడియాతో షేర్ చేశారాయన.

Prashanth Varma : ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘మహాభారతం’.. ఏ హీరోకి ఏ క్యారెక్టర్ అనుకుంటున్నాడో తెలుసా?

రాజీవ్‌కి  ఆ మధ్య ఫుడ్ పాయిజన్ అయ్యిందట. ఆసుపత్రిలో జాయిన్ అయ్యాక సెలైన్స్, యాంటిబయాటిక్స్ ఇచ్చారట. ఆ సమయంలో ఆసుపత్రిలో ఇచ్చిన ఫుడ్.. ఇంటి నుండి వచ్చిన ఫుడ్ కూడా తినేసేవారట. ఇక ఇంటికి వచ్చాక కూడా రోజూ స్వీట్స్ తినాలనిపించి రోజూ అరకిలో స్వీట్స్ తినేసేవారట. దాంతో సడెన్‌గా బరువు పెరిగిపోయారట. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంలో వరంగల్‌లో క్రికెట్ ఆడుతుండగా కాలు బెణికి నడవలేకపోయారట. ప్రస్తుతం బరువు తగ్గడానికి చాలా ప్రయత్నిస్తున్నారట. సో.. అదన్నమాట రాజీవ్ కనకాల బరువు పెరగడం వెనుక ఉన్న అసలు విషయం. రాజీవ్ ప్రస్తుతం రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీలో నటిస్తున్నారు.