Prashanth Varma : ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘మహాభారతం’.. ఏ హీరోకి ఏ క్యారెక్టర్ అనుకుంటున్నాడో తెలుసా?

ప్రశాంత్ వర్మ ఒకవేళ తాను మహాభారతం తీస్తే ఇప్పుడు ఉన్న నటుల్లో ఎవరెవరిని ఏ పాత్రకి తీసుకుంటానో తెలిపారు.

Prashanth Varma : ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘మహాభారతం’.. ఏ హీరోకి ఏ క్యారెక్టర్ అనుకుంటున్నాడో తెలుసా?

Prashanth Varma Interesting Comments on Tollywood Actors who sets for his Maha Bharatam Characters

Updated On : January 5, 2024 / 11:58 AM IST

Prashanth Varma Maha Bharatam : మన పురాణాలు రామాయణం, మహాభారతాలను, అందులో ఘట్టాలను గతంలో ఎన్టీఆర్, అప్పటి నటులు, దర్శకులు ఎన్నో సినిమాలుగా తీసి ప్రేక్షకుల ముందుకు తీచుకొచ్చారు. ఆ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు మళ్ళీ మన పురాణాల ఆధారంగా అన్ని పరిశ్రమలలోను సినిమాలు రాబోతున్నాయి. ఇటీవల రామాయణం ఆధారంగా ఆదిపురుష్ వచ్చిన సంగతి తెలిసిందే.

ముఖ్యంగా అందరూ మహాభారతాన్ని సినిమాగా తెరకెక్కించాలని చూస్తున్నారు. బాలీవుడ్ లో ఆల్రెడీ వివేక్ అగ్నిహోత్రి ‘పర్వ’ అనే టైటిల్ తో మహాభారతం కథాంశంతో సినిమాని ప్రకటించారు. ఇక రాజమౌళి కూడా మహాభారతం సినిమా తీస్తానని ప్రకటించాడు. కొత్త కొత్త కథలతో మెప్పిస్తున్న యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా మహాభారతం తీయాలని ఉందని ప్రకటించాడు.

Also Read : Janhvi Kapoor : తిరుమలలో జాన్వీ కపూర్ సందడి.. కొత్త సంవత్సరాన్ని వెంకన్న దర్శనంతో మొదలుపెట్టిన తంగం..

ప్రశాంత్ వర్మ ఇప్పుడు సంక్రాంతికి తేజ సజ్జ హీరోగా హనుమాన్ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ప్రశాంత్ వర్మ ఒకవేళ తాను మహాభారతం తీస్తే ఇప్పుడు ఉన్న నటుల్లో ఎవరెవరిని ఏ పాత్రకి తీసుకుంటానో తెలిపారు. యాంకర్ మహాభారతంలోని పాత్రలు అడగ్గా ప్రశాంత్ వర్మ వాటికి తన విజన్ లో ఎవరు సరిపోతారో చెప్పాడు.

ధర్మరాజు పాత్రకి చిరంజీవి, అర్జునుడు పాత్రకి రామ్ చరణ్, భీముడు పాత్రకి ఎన్టీఆర్, సహదేవుడు పాత్రకి విజయ్ దేవరకొండ, నకులుడు పాత్రకి నాని, కృష్ణుడు పాత్రకి మహేష్ బాబు, దుర్యోధనుడు పాత్రకి మోహన్ బాబు, కర్ణుడు పాత్రకి పవన్ కళ్యాణ్, ద్రౌపది పాత్రకి నయనతార అని చెప్పాడు. దీంతో ప్రశాంత్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ కాంబినేషన్ లో నిజంగా మహాభారతం సినిమా పడితే బాగుండు అని టాలీవుడ్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఐంతే అది అంత ఈజీ మాత్రం కాదు అని అందరికి తెలుసు.