Janhvi Kapoor : తిరుమలలో జాన్వీ కపూర్ సందడి.. కొత్త సంవత్సరాన్ని వెంకన్న దర్శనంతో మొదలుపెట్టిన ‘తంగం’..

జాన్వీ వేంకటేశ్వరస్వామి భక్తురాలు కూడా. రెగ్యులర్ గా తిరుమల(Tirumala) వెంకన్న దర్శనానికి వస్తుంది.

Janhvi Kapoor : తిరుమలలో జాన్వీ కపూర్ సందడి.. కొత్త సంవత్సరాన్ని వెంకన్న దర్శనంతో మొదలుపెట్టిన ‘తంగం’..

Bollywood Actress Janhvi Kapoor Visited Tirumala Venkateswara sWami Temple with Maheswari

Updated On : January 5, 2024 / 12:13 PM IST

Janhvi Kapoor : బాలీవుడ్(Bollywood) భామ జాన్వీ కపూర్ ‘దేవర'(Devara) సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అభిమానులతో పాటు జాన్వీ కూడా ఈ సినిమా త్వరగా రిలీజ్ అయి సౌత్ ప్రేక్షకులకు దగ్గరవ్వాలని చూస్తుంది. ఇక జాన్వీ ఎంత బాలీవుడ్ భామ అయినా తల్లి శ్రీదేవి సౌత్ కావడంతో పాటు ఆమెలో ఉన్న లక్షణాలు అన్ని పట్టేసుకుంది.

జాన్వీ వేంకటేశ్వరస్వామి భక్తురాలు కూడా. రెగ్యులర్ గా తిరుమల(Tirumala) వెంకన్న దర్శనానికి వస్తుంది. తాజాగా కొత్త సంవత్సరంలో నిన్న జనవరి 4 రాత్రి కాలి నడకన జాన్వీ తిరుమలకు చేరుకుంది. ఇవాళ ఉదయం జాన్వీ కపూర్ తన పిన్ని, నటి మహేశ్వరితో కలిసి వెంకన్న దర్శనం చేసుకుంది. దీంతో తిరుమల ఆలయం బయట జాన్వీ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read : యాత్ర 2 టీజర్ రిలీజ్.. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని..

ఇక జాన్వీ ఎప్పటిలాగే పద్దతిగా ఈసారి పట్టు చీరలో వచ్చి దర్శనం చేసుకుంది. తిరుమలలో దిగిన పలు ఫోటోలని, కాలినడకన ఉన్న మెట్లను తన సోషల్ మీడియాలో షేర్ చేసిన జాన్వీ.. 2024 మొదలైంది.. గోవిందా.. గోవిందా.. అని పోస్ట్ చేసింది. దీంతో జాన్వీ పోస్ట్ కూడా వైరల్ గా మారింది. శ్రీదేవి కూతురు మన తెలుగింటి ఆడపడుచు కాకుండా పోతుందా, ఎప్పటికైనా టాలీవుడ్ స్టార్ అవుతుంది అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక దేవర సినిమాలో తంగం అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో మెరిపించనుంది జాన్వీ.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)