Yatra 2 : యాత్ర 2 టీజర్ రిలీజ్.. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని..
తాజాగా నేడు యాత్ర 2 టీజర్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

Mammootty Jiiva Mahi V Raghav Yatra 2 Movie Teaser Released
Yatra 2 Teaser: 2019 ఎలక్షన్స్ ముందు వైఎస్సార్ బయోపిక్ గా దర్శకుడు మహి వి రాఘవ్.. యాత్ర సినిమాని తీసుకొచ్చారు. ఆ సినిమాలో వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి నటించగా ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా, మళ్ళీ ఎలక్షన్స్ ముందు యాత్ర 2 సినిమా తీసుకొస్తున్నారు. తమిళ నటుడు జీవా ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో నటిస్తున్నారు.
మహి వి రాఘవ్ దర్శకత్వంలోనే తెరకెక్కుతున్న ఈ మూవీని త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు పోస్టర్స్ రిలీజ్ చేయగా తాజాగా నేడు యాత్ర 2 టీజర్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.
Also Read : Naa Saami Ranga : ‘నా సామిరంగ’ నుంచి మెలోడీ ఫ్రెండ్షిప్ సాంగ్ రిలీజ్.. వింటే ఎమోషనల్ అవ్వాల్సిందే..
ఇక యాత్రలో వైఎస్సార్ బయోపిక్ గా చూపిస్తే యాత్ర 2 వైఎస్ జగన్ బయోపిక్ గా రానుంది. వైఎస్సార్ మరణించే ముందు పరిస్థితులతో పాటు మరణించాక జరిగిన రాజకీయాలు, జగన్ జైలు జీవితం, పాదయాత్ర, జగన్ సీఎం అవ్వడం.. కథాంశంతో రానుంది యాత్ర 2. యాత్ర 2 సినిమా ఫిబ్రవరి 8న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇక ఈ సినిమాలో చంద్రబాబు పాత్రలో మహేష్ మంజ్రేకర్, సోనియాగాంధీ పాత్రలో సుజన్నే బెర్నార్ట్, వైఎస్ భారతి పాత్రలో కేతకి నారాయణ్ తో పాటు పలువురు ప్రముఖులు నటిస్తున్నారు.