×
Ad

Suma Kanakala : ఆయన దుర్మార్గుడు.. నన్ను సినిమాల్లో యాక్ట్ చేయొద్దు అన్నారు.. సుమ ఫ్యూచర్ ఇదే..

యాంకర్ సుమ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఇందులో అనేక ఆసక్తికర విషయాలు తెలిపింది.(Suma Kanakala)

Suma Kanakala

Suma Kanakala : స్టార్ యాంకర్ సుమ కనకాల అనేక టీవీ షోలతో ఎన్నో ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇప్పుడు కూడా టీవీ షో, యూట్యూబ్ ఛానల్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో బిజీగా ఉంది సుమ. తాజాగా యాంకర్ సుమ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఇందులో అనేక ఆసక్తికర విషయాలు తెలిపింది.(Suma Kanakala)

ఈ క్రమంలో రాజీవ్ తనని సినిమాలు చేయొద్దు అన్నాడని, యాంకర్ కెరీర్ తర్వాత తన ఫ్యూచర్ ఏంటి అని తెలిపింది.

Also Read : SSMB 29 : మహేష్ సినిమా టైటిల్ అదే.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్.. రాజమౌళి సెంటిమెంట్ రిపీట్..

సుమ మాట్లాడుతూ.. (నవ్వుతు సరదాగా) మా ఆయన దుర్మార్గుడు. పెళ్లి చేసుకునే ముందే నేను చెప్పాను నువ్వు బిజినెస్ చేయాలని, సినిమా ఫీల్డ్ వద్దని. కానీ పెళ్లి అయి వాళ్ళింటికి వెళ్ళాక అక్కడ టిఫిన్, లంచ్, డిన్నర్ అన్నిట్లోనూ సినిమానే టాపిక్. వాళ్ళింట్లో సినిమా తప్ప ఇంకేమి వినపడదు. దొరికిపోయాం అనుకున్నా. మొదట్లో నన్ను సినిమాల్లో యాక్ట్ చేయొద్దు అన్నాడు రాజీవ్. ఇలా చెప్పాడని నో చెప్పి మూడు నాలుగు సినిమాలు చేశాను. కానీ ఆ సినిమాలు చూసాక తర్వాత తెలిసింది నాకు సినిమాలు సెట్ అవ్వవు అని. నాకే అనిపించి సినిమాలు వదిలేసా. జయమ్మ పంచాయితీ కథ నచ్చి చేశా. ఇప్పుడు చాలా రోల్స్ వస్తుంటాయి. అప్పుడప్పుడు సరదాగా చేస్తూ ఉంటా. సినిమాలు వద్దనుకున్నాక యాంకరింగ్ మీదే ఎక్కువ ఫోకస్ చేశాను అని తెలిపింది.

అలాగే తన ఫ్యూచర్ గురించి మాట్లాడుతూ.. నేను నిర్మాతగా పలు షోలో నిర్మించాను. ఇప్పుడు కూడా యూట్యూబ్ కంటెంట్ కి నేనే నిర్మాతని. భవిష్యత్తులో నిర్మాతగా వెబ్ సిరీస్ లు, మెయిన్ కంటెంట్ చేయాలి. నేను నటించకుండా కేవలం నిర్మాతగానే చేయాలి. మా పిల్లలు కూడా ఇదే ఇండస్ట్రీ అన్నారు. నేను మొదట ఆలోచించాను కానీ కరోనా వచ్చినప్పుడు ఫుడ్, ఎంటర్టైన్మెంట్ మాత్రమే అందరూ తీసుకున్నారు. అందుకే ఇండస్ట్రీలో స్కోప్ ఉందని వాళ్లకు కూడా ఓకే చెప్పాను అని తెలిపింది. దీంతో సుమ ఒక వేళ భవిష్యత్తులో యాంకరింగ్ కి గుడ్ బాయ్ చెప్పాల్సి వస్తే నిర్మాతగా సినిమాలు, సిరీస్ లు చేస్తుందని తెలుస్తుంది.

Also Read : Tamil Heros : తమిళ్ స్టార్ హీరోలకు షాక్ ఇచ్చిన నిర్మాతలు.. హీరో హీరోయిన్స్ అలా చేయకూడదు అంట.. ఇదెక్కడి రూల్స్..