Tamil Heros : తమిళ్ స్టార్ హీరోలకు షాక్ ఇచ్చిన నిర్మాతలు.. హీరో హీరోయిన్స్ అలా చేయకూడదు అంట.. ఇదెక్కడి రూల్స్..
తమిళ నిర్మాతల మండలి తాజాగా మీటింగ్ నిర్వహించుకున్నారు. ఈ మీటింగ్ లో నటీనటులకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. (Tamil Heros)
Tamil Heros
Tamil Heros : సినీ పరిశ్రమలో ఎవరికైనా ఇబ్బందులు వస్తే, సినిమా నిర్మాణ పరంగా ఇబ్బందులు వస్తే ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి చేసుకుంటాయి. తమిళ్ పరిశ్రమలో నిర్మాతల మండలి జోక్యం ఎక్కువగా ఉంటుంది. నిర్మాతల మండలి ఎవరో ఒక హీరోకు వార్నింగ్స్ ఇస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి తమిళ నిర్మాతల మండలి వార్తల్లో నిలిచింది.(Tamil Heros)
తమిళ నిర్మాతల మండలి తాజాగా మీటింగ్ నిర్వహించుకున్నారు. ఈ మీటింగ్ లో నటీనటులకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ముఖ్యంగా మూడు నిర్ణయాలు మాత్రం స్టార్ హీరో, హీరోయిన్స్ ని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.
Also Read : Suma Rajeev Kanakala : సుమ ఇక్కడ ప్రగ్నెన్సీతో.. అక్కడ రాజీవ్ కనకాల కాలు విరిగి.. సుమకు ఆ విషయంలో భయం..
తమిళ నిర్మాతల మండలి తీసుకున్న ముఖ్య నిర్ణయాలు..
* ఇకపై స్టార్ హీరోలు రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమాకు వచ్చే రెవెన్యూలో షేర్ మాత్రమే తీసుకోవాలి. లాస్ అయితే భరించాలి.
* స్టార్ హీరో, హీరోయిన్స్, సాంకేతిక నిపుణులు వెబ్ సిరీస్ లలో నటించడం ఆపేయాలి. ఎలాంటి వెబ్ సిరీస్ లలో నటించకూడదు.
*స్టార్ నటీనటులు బయట ప్రైవేట్ ఈవెంట్స్, మ్యూజిక్ షోస్ లో పాల్గొనాలంటే తమిళ నిర్మాతల మండలి, ఆర్టిస్ట్ అసోసియేషన్ పర్మిషన్ తీసుకోవాలి అని తీర్మానించారు.
Also Read : NTR : తెల్లారితే ఎన్టీఆర్ ముందు డ్యాన్స్ చేయాలి.. కానీ వీల్ చైర్ లో రాజు.. ఎన్టీఆర్ ఏమన్నాడంటే..
దీంతో ఈ నిర్ణయాలపై విమర్శలు వస్తున్నాయి. హీరోలు రెమ్యునరేషన్ కాకుండా రెవెన్యూ తీసుకోవడం మంచిదే. అధిక రెమ్యునరేషన్ కి కట్టడి చేసినట్టు ఉంటుంది కాబట్టి ఓకే. కానీ హీరో హీరోయిన్స్ ఎక్కడ నటించాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఈవెంట్స్ చేయాలా వద్దా అనేవి కూడా వీళ్ళు నిర్ణయించడం ఏంటి అని తమిళ పరిశ్రమలో విమర్శలు వస్తున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై తమిళ నటీనటులు ఎవరైనా మాట్లాడతారా చూడాలి. ఇవి అయితే జరిగే పని కాదు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
