×
Ad

Rajesh Danda : ట్విట్టర్లో సినిమా రివ్యూలలో వివక్ష చూపిస్తున్నారు.. తప్పు జరుగుతుంది.. K ర్యాంప్ సినిమాపై నిర్మాత వ్యాఖ్యలు వైరల్..

కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా నటించిన K ర్యాంప్ సినిమా నేడు థియేటర్స్ లో రిలీజయింది. (Rajesh Danda)

Rajesh Danda

Rajesh Danda : ఇటీవల సోషల్ మీడియాలో ఒక సినిమా బాగున్నా నెగిటివ్ ప్రమోషన్, నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం, తక్కువ రేటింగ్స్ ఇవ్వడం చేస్తున్నారు. కొంతమంది పనికట్టుకొని మరీ ఈ పని చేస్తున్నారు. దీనివల్ల చాలా సినిమాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా K ర్యాంప్ నిర్మాత చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.(Rajesh Danda)

కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా నటించిన K ర్యాంప్ సినిమా నేడు థియేటర్స్ లో రిలీజయింది. ఈ సినిమా ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. థియేటర్ లో ఈ సినిమా ప్రేక్షకులను ఫుల్ గా నవ్విస్తుంది. తాజాగా ఈ సినిమా సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

Also Read : K Ramp Review : ‘K ర్యాంప్’ మూవీ రివ్యూ.. కిరణ్ అబ్బవరం మాస్ ఎంటర్టైన్మెంట్ చూపించాడుగా..

ఈ ప్రెస్ మీట్ లో K ర్యాంప్ నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ.. ఈ సినిమా కేవలం నవ్వుకోడానికి చేసిందే. కథలో లాజిక్స్ వెతుక్కోడానికి కాదు. ఇవాళ ఉదయం లేచేసరికి ట్విట్టర్లో రేటింగ్స్ చూసి బాధపడ్డాను. మీరు ఏ రేటింగ్ అయినా ఇవ్వండి. మీరెంతైనా రేటింగ్ ఇవ్వండి నేను వెల్కమ్ చేస్తాను. కానీ ఇక్కడ ఒక తప్పు జరుగుతుంది. పార్షియాలిటీ చూపిస్తున్నారు. నేను ఇవాళ అది మాట్లాడతాను.

ట్విట్టర్లో కొన్ని హ్యాండిల్స్ ఒక సినిమాకు ఫస్ట్ హాఫ్ కి రివ్యూ ఇస్తున్నారు, సెకండ్ హాఫ్ కి ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు. కొన్ని సినిమాలకు సెకండ్ హాఫ్ రెండు మూడు గంటల తర్వాత రివ్యూ ఇస్తున్నారు. కొన్ని సినిమాలకు సెకండ్ హాఫ్ వెంటనే రివ్యూ ఇస్తారు. ఇంకొన్ని సినిమాలకు రివ్యూ పెడతారు కానీ రేటింగ్ ఎప్పుడో మధ్యాహ్నానికి వేస్తారు. సినిమా సినిమాకి డిఫరెన్స్ చూపిస్తున్నారు. ఈ వివక్ష ఎందుకు చూపిస్తున్నారు. చిన్న నిర్మాతని ఇతను ఏం చేసినా పడతాడు అని చూపిస్తున్నారా? నాకు అర్ధం కావట్లేదు. రివ్యూ టైమింగ్ అందరికి ఒకేలా ఉండాలి కదా. కానీ ఎందుకు డిఫరెన్స్ ఇస్తున్నారు. ఈ సినిమా కలెక్షన్స్ బయట తెలుసుకోండి. నేను చెప్తే డప్పు కొట్టినట్టు ఉంటుంది. కలెక్షన్స్ షో షోకి పెరుగుతున్నాయి. జనాలకు ఈ సినిమా నచ్చింది. హౌస్ ఫుల్ అవుతున్నాయి షోలు అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Music Director Bunty : సీరియల్ సాంగ్స్ తీసేస్తున్నారు బాధపడుతున్న మ్యూజిక్ డైరెక్టర్.. అన్ని ఛానల్స్ ని వేడుకున్నాను..