Vettaiyan : ‘వేట్టయన్’ మూవీ రివ్యూ.. రొటీన్ కథకు సూపర్ స్టార్ హంగులు..

మాస్ ఎలివేషన్స్ ఇస్తూ రజినీకాంత్ సినిమా అనేలా చూపించడానికి ప్రయత్నం చేసారు.

Rajinikanth Amitabh Fahadh Faasil Rana Vettaiyan Movie Review & Rating

Vettaiyan Movie Review : సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ మెయిన్ లీడ్ లో TJ జ్ఞానవేల్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన సినిమా ‘వేట్టయన్’. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మాణంలో తెరకెక్కిన వేట్టయన్ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, ఫహాద్‌ ఫాజిల్‌,రానా, మంజు వారియర్, రితిక సింగ్.. పలువురు ముఖ్య పాత్రలు పోషిచారు. వేట్టయన్ సినిమా నేడు అక్టోబ‌ర్ 10న ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది.

కథ విషయానికొస్తే.. అదియన్(రజినీకాంత్) ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్, SPగా పనిచేస్తూ ఉంటాడు. శరణ్య(దుషారా విజయన్) ఓ చిన్న ఊళ్ళో గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తూ ఉండగా ఆ స్కూల్లో ఊరి రౌడీలు గంజాయి బస్తాలు తీసుకొచ్చి దాయడంతో అదియన్ కి కంప్లైంట్ చేస్తుంది. బ్యాటరీ(ఫహద్ ఫాజిల్) సాయంతో అదియన్ ఆ కేసు డీల్ చేసి మంచిపని చేసిందని శరణ్యని పాపులర్ చేస్తాడు. దీంతో ఆమెకు కావాల్సిన చెన్నై ట్రాన్స్ఫర్ వస్తుంది. ఓ రోజు తను పనిచేసే స్కూల్ లో శరణ్య రేప్ కి గురయి హత్య చేయబడుతుంది. దీంతో పోలీసులు దర్యాప్తు చేసి గుణ అనే ఓ వ్యక్తిని పట్టుకుంటే అతను పారిపోతాడు. బయట ప్రెజర్ ఎక్కువ అవడంతో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అదియన్ ని పిలిపించి అతనే నేరస్థుడు అని చంపేయమంటారు. అదియన్ గుణని వెతికి ఎన్‌కౌంటర్ చేస్తాడు.

సీనియర్ న్యాయవాది, ఎన్‌కౌంటర్స్ కి వ్యతిరేకంగా పోరాడే సత్యదేవ్(అమితాబ్ బచ్చన్) గుణ శరణ్యను చంపలేదని, ఇది హత్య అని గుణ హంతకుడు కాదని కొన్ని ప్రూఫ్ లు తీసుకొస్తాడు. దీంతో అదియన్ మొదటిసారి ఓ అమాయకుడిని చంపేశానని గిల్టీగా ఫీల్ అయి అసలైన హంతకుడిని పట్టుకొడవడానికి ప్రయత్నం చేస్తాడు. మరి అదియన్ అసలు హంతకుడిని పట్టుకున్నాడా? శరణ్యని చంపించింది ఎవరు? ఈ కేసుకు నీట్ కోచింగ్ ఇచ్చే విద్యాసంస్థకు సంబంధం ఏంటి? బ్యాటరీ ఎవరు, ఎందుకు అదియన్ కి సహాయం చేస్తున్నాడు ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : PVCU 3 : ‘హను మాన్’ యూనివర్స్ నుంచి “మహా కాళీ”.. తొలి మ‌హిళా సూప‌ర్ హీరో!

సినిమా విశ్లేషణ.. ఓ కేసులో ఫేక్ ఎన్ కౌంటర్ జరిగి అమాయకుడు చనిపోతే అసలు హంతకుడిని ఎలా పట్టుకుంటారు అనే కథాంశంతో గతంలోనే బోలెడు సినిమాలు వచ్చాయి. ఈ వేట్టయన్ కూడా అదే కోవకు చెందింది. అలాగే అసలు సమస్యని దాటడానికి ఇలా రేప్ కేసును ముందుకు తీసుకురావడం గతంలో జనగణమన అనే మలయాళం సినిమా వచ్చింది. అదే కథని తీసుకొని కొన్ని మార్పులు చేర్పులు చేసి దింపేశారు. ఈ కథని రజినీకాంత్ కి పోలీస్ పాత్రలో మాస్ ఎలివేషన్స్ ఇస్తూ రజినీకాంత్ సినిమా అనేలా చూపించడానికి ప్రయత్నం చేసారు.

ఫస్ట్ హాఫ్ హీరో పాత్ర ఎలివేషన్, శరణ్య పాత్ర, హంతకుడిని పట్టుకోవడం సాగుతుంది ఇంటర్వెల్ కి గుణ హంతకుడు కాదు అనే అందరూ ఊహించే రొటీన్ ట్విస్ట్ ఇచ్చి సెకండ్ హాఫ్ కి లీడ్ ఇస్తారు. ఇక సెకండ్ హాఫ్ అసలు నేరస్థుడ్ని పట్టుకోవడానికి చాలా సాగదీశారు. రెగ్యులర్ కథల్లాగే బాగా డబ్బున్న వ్యక్తికి, అతన్ని బిజినెస్ కి ఈ కేసు లింక్ పెట్టి ముగించారు. చివర్లో ఎన్ కౌంటర్ వల్ల అమాయకులు చనిపోతున్నారని ఎన్ కౌంటర్ తప్పు అనే ఓ మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేసారు. సినిమాలో రజినీకాంత్ ఎలివేషన్స్ ఫ్యాన్స్ కి ఆనందం తప్ప రొటీన్ స్క్రీన్ ప్లే, రొటీన్ కథతో సాగుతుంది.

నటీనటుల పర్ఫార్మెన్స్.. రజినీకాంత్ కి వయసు పెరుగుతున్నా అభిమానుల కోసం జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాలు చేస్తున్నారు. స్క్రీన్ పై రజిని కనిపిస్తే వచ్చే స్వాగ్ ని అలాగే మెయింటైన్ చేస్తూ ఫ్యాన్స్ కోసం మరోసారి కష్టపడ్డారు రజిని. అమితాబ్ బచ్చన్ సీనియర్ న్యాయవాది పాత్రలో సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో మెప్పించారు. రజినీకాంత్ భార్య పాత్రలో మలయాళం స్టార్ మంజు వారియర్ అదరగొట్టింది. పోలీసాఫీసర్ పాత్రలో రితిక కూడా బాగానే మెప్పించింది. రజినీకాంత్ కి సపోర్ట్ గా ఉండే పోలీస్ ఇన్ఫార్మర్ పాత్రలో ఫహద్ ఫాజిల్ అదరగొట్టాడు. సినిమాలో అక్కడక్కడైనా నవ్వుకున్నాము అంటే ఫహద్ వల్లే. రానా నెగిటివ్ పాత్రలో మెప్పించాడు. శరణ్య పాత్రలో దుషారా విజయన్ కూడా మంచి పాత్రలో మెప్పించింది. కిషోర్, సుప్రీత్, రావు రమేష్, అభిరామి.. మిగిలిన నటీనటులంతా వారి పాత్రల్లో మెప్పించారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఈ సినిమాకి అనిరుద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్కే బలం. BGM లేకపోతే ఈ సినిమా చప్పగా సాగుతుంది. పాటలు బాగానే ఉన్నాయి. రెగ్యులర్ కథ, స్క్రీన్ ప్లేకి రజినీకాంత్ ఎలివేషన్స్ జోడించి కొత్తగా చూపించాలని దర్శకుడు ప్రయత్నం చేసాడు. నిర్మాణ పరంగా లైకా భారీగానే ఖర్చుపెడుతుందని తెలిసిందే. తెరపై ఆ ఖర్చు కనిపిస్తుంది.

మొత్తంగా ‘వేట్టయన్’ మూవీ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఓ ఫేక్ ఎన్‌కౌంటర్ కి కారణమైతే అసలు నేరస్థుడ్ని ఎలా పట్టుకున్నారు అని ఓ మెసేజ్ తో కమర్షియల్ గా చూపించే ప్రయత్నం చేసారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక.. ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రం.