PVCU 3 : ‘హను మాన్’ యూనివర్స్ నుంచి “మహా కాళీ”.. తొలి మహిళా సూపర్ హీరో!
టాలీవుడ్‌లో మొదటి సూపర్ హీరో మూవీ హను మాన్.

Prasanth varma unleashes the first female indian superhero film
PVCU 3 : టాలీవుడ్‌లో మొదటి సూపర్ హీరో మూవీ హను మాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విజయం తరువాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మరిన్ని సినిమాలు వస్తాయని ఇప్పటికే చెప్పాడు ప్రశాంత్. అలా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మూడో సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ను దేవీ నవరాత్రుల సమయంలో అనౌన్స్ చేశాడు.
ఈ చిత్రానికి మహా కాళీ అనే టైటిల్‌ను ఖారారు చేశారు. భారతీయ సినీ ప్రపంచంలో మొదటి మహిళా సూపర్ హీరో సినిమాగా ఈ చిత్రం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి మహిళా దర్శకురాలు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తోంది. RKD స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Ratan Tata : రతన్ టాటాకు సినీ ప్రముఖుల నివాళి..
మహా కాళీ టైటిల్ రివీల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఒక అమ్మాయి తన తలను పులికి సున్నితంగా తాకినట్లు చూపించారు. ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకి స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ IMAX 3Dలో భారతీయ, విదేశీ భాషలలో విడుదల చేయనున్నారు.
On this auspicious occasion of Navratri, I’m thrilled to share something very special. Together with @RKDStudios, we proudly present the tale of an invincible warrior, the protector of the righteous, and the ultimate destroyer of evil 🔥
From the universe of #HanuMan ❤️🔥, prepare… pic.twitter.com/hDP8pFX9PE
— Prasanth Varma (@PrasanthVarma) October 10, 2024