Coolie – War 2 : రెండు సినిమాల అడ్వాన్స్ సేల్స్ ఎన్ని కోట్లు తెలుసా? కూలీకి దరిదాపుల్లో కూడా లేని వార్ 2..

రేపు ఆగస్టు 14న కూలీ, వార్ 2 సినిమాలు రిలీజవుతున్న సంగతి తెలిసిందే.

Coolie War 2

Coolie – War 2 : రేపు ఆగస్టు 14న కూలీ, వార్ 2 సినిమాలు రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలపై భారీ హైప్ ఉంది. ఒకటి తమిళ్, ఇంకోటి బాలీవుడ్ సినిమా అయినా తెలుగు హీరోలు ఉండటంతో తెలుగులో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యాన్స్ తో పాటు సినిమా లవర్స్ కూడా ఈ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు.

అయితే ఇప్పటికే అన్ని చోట్ల టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసారు. ఫ్యాన్స్ మొదటి రోజే సినిమా చూడటానికి టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఈ అడ్వాన్స్ సేల్స్ లో కూలీ సినిమా ముందుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఇండియాతో పాటు మలేషియా, జపాన్, సింగపూర్, అమెరికాలో కూడా భారీగా ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. అందులోను లోకేష్ కనగరాజ్ సినిమా కావడం, నాగార్జున మొదటి సారి విలన్ గా చేయడం, బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ గెస్ట్ అపియరెన్స్, కన్నడ స్టార్ ఉపేంద్ర ఉండటం.. ఇలా అన్ని పరిశ్రమ స్టార్స్ ఉండటంతో అడ్వాన్స్ సేల్స్ అదిరిపోతున్నాయి.

Also Read : Movie Ticket Prices : వార్ 2, కూలీ మూవీ టికెట్ రేట్లు పెంపు.. ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!

కూలీ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించేసింది. కేవలం అమెరికా నుంచే 20 కోట్ల గ్రాస్ అడ్వాన్స్ సేల్స్ వచ్చాయి కూలీ సినిమాకు. ఇంక నేడు, రేపు కూడా ఉండటంతో కూలీ సినిమా మొదటి రోజు కలెక్షన్ లో సరికొత్త రికార్డ్ కొడుతుందని భావిస్తున్నారు. ఈజీగా 120 కోట్ల వరకు కలెక్షన్స్ రావొచ్చు అని అంచనా వేస్తున్నారు.

ఓ పక్క కూలీ సినిమా ఇలా దూసుకుపోతుంటే మరో పక్క వార్ 2 ఇప్పుడే పైకి వస్తుంది. వార్ 2 సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ కాస్త లెట్ గా ఓపెన్ చేసారు. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా వార్ 2 సినిమాకు కేవలం 20 కోట్ల అడ్వాన్స్ సేల్స్ జరిగాయి. తెలుగు బుకింగ్స్ నిన్న రాత్రే ఓపెన్ చేసారు కాబట్టి నేడు ఆ లెక్క పెరుగుతుంది. తెలుగులో కేవలం ఎన్టీఆర్ కోసం ఆ సినిమాకి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు. హిందీలో మాత్రం YRF సినిమాటిక్ యూనివర్స్ కాబట్టి కాస్త అంచనాలు ఉన్నాయి. అక్కడ కూడా బుకింగ్స్ బాగానే ఉన్నాయి. తెలుగులో అయితే ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి వార్ 2 సినిమా భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుంటుంది.

Also Read : Rahul Sankrityan : సినిమా షూటింగ్ వాయిదా ప‌డ‌డంతో ఆవేద‌న‌లో విజ‌య్‌దేవ‌ర‌కొండ డైరెక్ట‌ర్ ట్వీట్‌.. టాలీవుడ్ స‌మ్మె పై..

మరి ఈ రెండు సినిమాల్లో మొదటి రోజు కలెక్షన్స్ లో ఎవరు ఎక్కువ చూపిస్తారో, ఎవరు ఎక్కువ రికార్డ్ సెట్ చేస్తారో చూడాలి.