రజినీ రెండవ కూతురు ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్
రజినీ రెండవ కూతురు ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్, చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో గ్రాండ్‌గా జరిగింది.

రజినీ రెండవ కూతురు ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్, చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో గ్రాండ్‌గా జరిగింది.
సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజినీకాంత్ ఇంట త్వరలో పెళ్ళి బాజాలు మోగనున్నాయి. రజినీ రెండవ కూతురు సౌందర్య రజినీకాంత్ పెళ్ళి పీటలెక్కబోతుంది. . తమిళనాడుకి చెందిన వ్యాపారవేత్త విషాగన్‌తో, సౌందర్య వివాహం జరగనుంది. ఈ రోజు (ఫిబ్రవరి 8) ఉదయం 11 గంటలకు, చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్‌గా జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ మాత్రమే అలెండ్ అయ్యారని తెలుస్తుంది. రజినీ రెండవ కూతురి ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కార్యక్రమం చివరి వరకూ రజినీ దంపతులు వేదిక పైనే ఉండి, అతిథులను ఆహ్వానించారు. ఫిబ్రవరి 11న చెన్నైలో సౌందర్య, విషాగన్‌ల వివాహం జరగనుందని తెలుస్తుంది.
ఇంతకుముందు 2010లో అశ్విన్ రామ్‌కుమార్‌తో సౌందర్య మ్యారేజ్ జరిగింది. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. విబేధాల కారణంగా 2017లో విడాకులు తీసుకున్నారు. విషాగన్‌కి కూడా ఇది రెండవ పెళ్ళే. గతంలో కనికా కుమారన్ అనే మ్యాగజైన్ ఎడిటర్‌ని వివాహం చేసుకున్న విషాగన్, కొన్ని కారణాల వల్ల ఆమెతో విడిపోయాడు. ఇక సౌందర్య విషయానికి వస్తే, తను స్వతహాగా గ్రాఫిక్ డిజైనర్. రజినీతో కొచ్చాడియాన్ మూవీ చేసింది. తర్వాత బావ ధనుష్ హీరోగా విఐపి 2 చేసింది.