Jailer 2 : జైలర్‌ 2 తెలుగు ప్రమోషన్స్ లేనట్టేనా.. నిరాశలో టాలీవుడ్ ప్రేక్షకులు..

జైలర్ 2కి సంబంధించి ఎలాంటి తెలుగు ప్రమోషన్లు లేకపోవడం టాలీవుడ్ ఆడియెన్స్‌లో కొంత డిజప్పాయింట్‌ కనిపిస్తోంది. (Jailer 2)

  • Published on- October 13, 2026 / 08:19 PM IST

Jailer 2

Jailer 2 : సూపర్‌స్టార్ రజనీకాంత్ మోస్ట్ యాంటిసిపేటెడ్‌ సీక్వెల్‌ జైలర్‌ 2 సినిమా.. అక్టోబర్ 15 ఈ గురువారమే పాన్‌ ఇండియా లెవెల్‌లో బాక్సాఫీస్‌ ముందుకొస్తుంది. జైలర్ 2కి సంబంధించి ఎలాంటి తెలుగు ప్రమోషన్లు లేకపోవడం టాలీవుడ్ ఆడియెన్స్‌లో కొంత డిజప్పాయింట్‌ కనిపిస్తోంది. భారీ అంచనాలున్న జైలర్ 2ని తెలుగు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్న సితార నిర్మాతలు సైతం లాస్ట్‌ మినిట్‌లో ప్రమోషన్స్‌ స్కిప్‌ చేయడంపైనే ఆడియెన్స్‌ చర్చించుకుంటున్నారు.

జైలర్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్టోబర్ 12న జరుగుతుందని, అనిరుద్ లైవ్ కాన్సర్ట్ ఉంటుందని, రజినీకాంత్ తప్ప మిగతా యూనిట్ అంతా వస్తారని అనౌన్స్ చేసారు. కానీ చివరి నిమిషంలో ఆ ఈవెంట్ కూడా క్యాన్సిల్ చేసారు. కనీసం ఒక ప్రెస్ మీట్ అయినా పెడతారు అని భావించారు కానీ అది కూడా లేదు. టాలీవుడ్ ని లైట్ తీసుకున్నారేమో అని ఇక్కడి ప్రేక్షకులు భావిస్తున్నారు.

Also Read : Alias Rukmini : ‘అలియాస్ రుక్మిణి’.. నితిన్ పక్కన బాలీవుడ్ హీరోయిన్.. గ్లింప్స్ రిలీజ్..

ప్రమోషన్స్‌ పరంగానే కాదు.. జైలర్‌ సీక్వెల్‌ కాస్టింగ్‌పై కూడా టాలీవుడ్ ఆడియెన్స్‌లో కొంత డిజప్పాయింట్‌ కనిపిస్తోంది. బాలీవుడ్ నుంచి హృతిక్‌ రోషన్, విద్యా బాలన్‌, జాకీ ష్రాఫ్ లతో క్యామియోస్‌ ప్లాన్ చేసిన డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌ కుమార్.. మలయాళం నుంచి మోహన్‌లాల్‌, సూరజ్ వెంజరమూడు అలాగే కన్నడ నుంచి శివరాజ్‌కుమార్ లతో బ్యాలెన్స్‌ చేశారు. అదే తెలుగు విషయానికి వచ్చేసరికి పూర్తిగా నెగ్‌లెక్ట్‌ చేశారని వర్రీ అవుతున్నారు ఆడియెన్స్.

గతంలో జైలర్ లో బాలయ్య గెస్ట్ అప్పీరెన్స్ కూడా ఉంటుందని వార్తలు వచ్చాయి. దర్శకుడు నెల్సన్ కూడా బాలయ్యని ఒక పాత్రకు అనుకున్నాము కానీ కుదరలేదు అని అన్నారు. దీంతో జైలర్ 2 లో అయినా బాలయ్య గెస్ట్ అప్పీరెన్స్ ఓ రేంజ్ లో ఉంటుందని బాలయ్య ఫ్యాన్స్, టాలీవుడ్ ప్రేక్షకులు ఆశించారు. కానీ అది కూడా లేదు. రూమర్స్‌ నిజం అయ్యేలా నటసింహం బాలయ్య జైలర్‌2లో భాగమై ఉంటే ఆ రెస్పాన్స్‌ వేరే లెవెల్ ఉండేది.

Also Read : Jayammu Nischayammu Raa : జగపతి బాబు జయమ్ము నిశ్చయమ్మురా.. సెకండ్ సీజన్.. సాయి పల్లవితో మొదలు.. ప్రోమో చూశారా?

జైలర్ ఫస్ట్‌పార్ట్‌లో తమన్నా స్పెషల్‌ సాంగ్‌ నువ్వు కావాలయ్య.. తెలుగు ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పించాయి. అయితే ఈ సీక్వెల్ కోసం కంప్లీట్‌గా బాలీవుడ్ మార్కెట్‌పైనే ఫోకస్‌ పెట్టిన నెల్సన్‌.. ఈ సారి నోరా ఫతేని రంగంలోకి దించారు. బిందాస్, బిందాస్‌ అంటూ వచ్చిన ఈ సాంగ్‌.. నువ్వు కావాలయ్య రేంజ్‌లో చార్ట్‌బాస్టర్‌ కాలేదు. తలైవా టాలీవుడ్‌ మార్కెట్‌ దృష్టిలో పెట్టుకుని, టాలీవుడ్ నుంచి ఎవరితోనైనా క్యామియో ప్లాన్ చేసి ఉండాల్సిదంటున్నారు. కాస్టింగ్‌ పరంగా, ప్రమోషన్స్ పరంగా డిజప్పాయింట్ చేసిన జైలర్ 2 మేకర్స్.. తెలుగు రిలీజ్ ప్రెస్‌మీట్‌ అయినా ప్లాన్‌ చేస్తారో లేదో చూడాలి.