Lal Salaam : సంక్రాంతి బరి నుండి తప్పుకున్న రజినీకాంత్.. రవితేజతో పోటీకి రెడీ..

లాల్ సలామ్ సినిమా సంక్రాంతి బరి నుండి తప్పుకుంది. సంక్రాంతి బరి నుంచి తప్పుకొని కొత్త డేట్ ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు.

Rajinikanth Lal Salaam Movie New Release Date Announced left from Pongal Race

Rajinikanth Lal Salaam : సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ డైరెక్టర్ గా మారి తెరకెక్కిస్తున్న సినిమా ‘లాల్ సలామ్’. తమిళ హీరో విష్ణు విశాల్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుంటే రజినీకాంత్ ‘మొయ్దీన్ భాయ్‌’గా ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. అలాగే భారత్ క్రికెటర్ కపిల్ దేవ్, జీవిత రాజశేఖర్ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.

అయితే లాల్ సలామ్ సినిమాని సంక్రాంతికి(Sankranthi) విడుదల చేస్తామని ప్రకటించారు. ఆల్రెడీ సినిమా నుంచి టీజర్, ఓ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. అయితే సంక్రాంతికి మన తెలుగుతో పాటు తమిళ్ లో కూడా సినిమాల క్లాష్ ఉంది. తమిళ్ లో కూడా సంక్రాతికి నాలుగు సినిమాలు ఉన్నాయి. దీంతో లాల్ సలామ్ సినిమా సంక్రాంతి బరి నుండి తప్పుకుంది. సంక్రాంతి బరి నుంచి తప్పుకొని కొత్త డేట్ ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు.

లాల్ సలామ్ సినిమా ఫిబ్రవరి 9న రాబోతున్నట్టు ప్రకటించారు. ఇక ఈ సినిమాని తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. అయితే ఆ సమయానికి తమిళ్ లో ఎన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి ఇంకా ఫైనల్ అవ్వలేదు కానీ తెలుగులో మాత్రం సినిమాలు ఉన్నాయి. ఈ సంక్రాంతికి తప్పుకొని రవితేజ(Raviteja) ఈగల్ ఫిబ్రవరి 9న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈగల్ తో పాటు యాత్ర 2 ఫిబ్రవరి 8న, సందీప్ కిషన్ ఊరిపేరు భైరవకోన ఫిబ్రవరి 9న రిలీజ్ కాబోతున్నాయి. దీంతో ఫిబ్రవరిలో కూడా సంక్రాంతి లాగే భారీ క్లాష్ రానుంది. అప్పుడు రవితేజకి రజినీతో పోటీ తప్పేలా లేదు.

Also Read : Mahesh Babu : శ్రీలీల తో డాన్స్ అంటే హీరోలందరికీ తాట ఊడిపోతుంది..

ఇక లాల్ సలాం సినిమా హిందు, ముస్లిం గొడవలకు క్రికెట్ టచ్ ఇస్తూ కొత్త కథాంశంతో ఐశ్వర్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విష్ణు విశాల్ ఇందులో క్రికెట్ ప్లేయర్ గా కనిపించబోతున్నారు.