Lal Salaam Release Date Announced
Lal Salaam : తలైవా రజినీకాంత్ (Rajinikanth) కూతురు ఐశ్వర్య రజినీకాంత్ (Aishwarya Rajinikanth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘లాల్ సలామ్’. విష్ణు విశాల్ (Vishnu Vishal), విక్రాంత్ (Vikranth) లు హీరోలుగా నటిస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఓ సాలీడ్ అప్‌డేట్ వచ్చేసింది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం తెలియజేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.
అయితే.. ప్రత్యేకించి ఏ తేదీ అన్నది మాత్రం చెప్పలేదు. ఐశ్వర్య దాదాపు 6 ఏళ్ళ తరువాత దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. నటి జీవిత రాజశేఖర్ కూడా ఈ సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీలో రజినీకాంత్ ‘మొయ్దీన్ భాయ్’గా కనిపించనున్నాడు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఏ ఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
సంక్రాంతికి బరిలో..
లాల్ సలామ్ చిత్రంతో పాటు వచ్చే ఏడాది సంక్రాంతికి బరిలో చాలా సినిమాలు ఉన్నాయి. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘హనుమాన్’, సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న ‘గుంటూరు కారం’, మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న’ఈగల్’. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘VD13’తో పాటు నాగార్జున హీరోగా నటిస్తున్న ‘నా సామిరంగ’ సంక్రాంతి బరిలో ఉన్నాయి.