Rajinikanth : యోగి ఆదిత్యనాథ్ కాళ్ళకి నమస్కరించిన రజినీకాంత్.. వైరల్ అవుతున్న వీడియో, ఫొటోలు..

రజినీకాంత్ యోగి ఆదిత్యనాథ్ వద్దకు వెళ్ళగానే ఆయన కాళ్ళకి నమస్కరించాడు. రజినీకాంత్ కి భక్తి ఎక్కువ అని తెలిసిందే. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ సాధువు కాబట్టి వయసులో చిన్నవాడైనా హిందూ ధర్మం ప్రకారం ఆయన కాళ్ళకి నమస్కరించారు.

Rajinikanth Meet UP CM Yogi Adityanath and touch his Feet Photos and Videos goes viral

Rajinikanth :  జైలర్(Jailer) సినిమా భారీ విజయం సాధించడంతో రజినీకాంత్ ఆలయాల సందర్శనకు వెళ్లారు. ఇటీవల బద్రీనాథ్ కి వెళ్లిన రజినీకాంత్, అక్కడ చుట్టుపక్కల ఉన్న ఆలయాలని కూడా సందర్శిస్తున్నారు. అలాగే తిరుగు ప్రయాణంలో నిన్న లక్నోకి వెళ్లారు. లక్నోలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) ని కలిసి ఆయనతో జైలర్ సినిమా చూశారు. అయితే వీరి భేటీ ఇప్పుడు వార్తల్లోకి ఎక్కి వైరల్ గా మారింది. అందుకు కారణం రజినీకాంత్ యోగి ఆదిత్యనాథ్ పాదాలకు నమస్కరించడమే.

రజినీకాంత్ యోగి ఆదిత్యనాథ్ వద్దకు వెళ్ళగానే ఆయన కాళ్ళకి నమస్కరించాడు. రజినీకాంత్ కి భక్తి ఎక్కువ అని తెలిసిందే. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ సాధువు కాబట్టి వయసులో చిన్నవాడైనా హిందూ ధర్మం ప్రకారం ఆయన కాళ్ళకి నమస్కరించారు. అనంతరం ఆయనతో కాసేపు భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి జైలర్ సినిమా చూశారు. జైలర్ సినిమా మంచి విజయం సాధించినందుకు యోగి ఆదిత్యనాథ్ రజినీకాంత్ ని అభినందించారు.

Samantha : అమ్మ‌తో అమెరికాకు స‌మంత.. చికిత్స కోసం కాద‌ట‌.. మ‌రీ ఎందుకు వెళ్లిదంటే..?

అయితే రజిని యోగి కాళ్ళకి నమస్కారం పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొంతమంది రజిని హేటర్స్ కావాలని దీన్ని నెగిటివ్ గా ప్రమోట్ చేస్తున్నారు. ఇక తమిళనాడులో చాలా మంది బీజేపీకి వ్యతిరేకం అని తెలిసిందే. దీంతో దీన్ని రాజకీయ భేటీగా కూడా మార్చి మరింత నెగిటివ్ గా ప్రమోట్ చేస్తున్నారు. అయితే రజిని ఫ్యాన్స్, బీజేపీ వాళ్ళు మాత్రం యోగి సాధువు కాబట్టి నమస్కరించారు. అది హిందూ ధర్మం అంటూ రజినీకి సపోర్ట్ గా పోస్టులు చేస్తున్నారు. మొత్తానికి రజినీకాంత్ యోగి ఆదిత్యనాథ్ భేటీ దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఇక తమిళనాడులో అయితే దీనిపై రాజకీయంగా కూడా చర్చ జరుగుతుంది.