Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియాలోనే కాకుండా జపాన్, మలేషియా వంటి దేశాల్లో కూడా రజినికి ఫ్యాన్స్ ఉంటారు. అయితే కేవలం అక్కడి ప్రజలు మాత్రమే కాదు, అధికారులు కూడా రజినీకాంత్ ని అభినందిస్తుంటారు. తాజాగా మలేషియా ప్రైమ్ మినిస్టర్ అన్వర్ ఇబ్రహీం (Anwar Ibrahim) రజినీకాంత్ ని కలుసుకోగా.. అందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Genelia : మూడోసారి తల్లి కాబోతున్న జెనీలియా..? స్పందించిన భర్త.. ఏమన్నాడంటే..?
రజినీకాంత్ రీసెంట్ గా మలేషియా వెళ్ళాడు. ఈక్రమంలోనే అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో రజిని.. అన్వర్ ఇబ్రహీంని కలుసుకున్నాడు. రజినీకి అన్వర్ ఇబ్రహీం ఎదురొచ్చి మరి ఆహ్వానం పలికారు. అది కూడా శివాజీ స్టైల్లో. రజినీకాంత్ నటించిన శివాజీ సినిమా అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. ఆ సినిమా చివరిలో రజిని గుండు గెటప్ లో కనిపిస్తాడు. ఆ గెటప్ లో రజిని గుండు పై చేతి వేలుతో కొడుతూ బాస్ గుండు బాస్ అంటాడు. ఈక్రమంలోనే అన్వర్ ఇబ్రహీం.. రజినిని చూడగానే అలా చేసి చూపించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
Jawan Collections : బాక్సాఫీస్ పై బాలీవుడ్ బాద్ షా దండయాత్ర.. నాలుగు రోజుల్లో 520 కోట్లు
Define MASS.
Prime minister of Malaysia greets Superstar #Rajinikanth.
||#Thalaivar171||pic.twitter.com/1iAaNYhvTr
— Manobala Vijayabalan (@ManobalaV) September 11, 2023
ఇక ఈ ఇద్దరి భేటీ గురించి అన్వర్ ఇబ్రహీం ఒక ప్రత్యేక ట్వీట్ కూడా చేశారు. “ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్న రజినీకాంత్ ని కలుసుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. నేను ప్రజలకి అందించిన సేవలని ఆయన అభినందించగా.. ఆయన తీసే భవిషత్తు సినిమాల్లో సామాజిక అంశాలు ఉండేలా చూడండి అంటూ నేను కోరాను” అంటూ అన్వర్ ఇబ్రహీం పేర్కొన్నారు. కాగా రజిని మలేషియా ప్రధానిని కలుసుకోవడం ఇది మొదటిసారి కాదు. 2017లో అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన నజీబ్ రజాక్ ని కూడా ప్రత్యేకంగా కలుసుకున్నాడు.
Hari ini saya menerima kunjungan bintang filem India, Rajinikanth yakni satu nama yang tidak asing lagi di pentas dunia seni asia dan antarabangsa.
Saya hargai penghormatan yang diberikan beliau terhadap perjuangan saya khasnya terkait isu kesengsaraan dan penderitaan rakyat.… pic.twitter.com/Sj1ChBMuN6
— Anwar Ibrahim (@anwaribrahim) September 11, 2023