Jailer 2 : ఆ స్పెషల్ డేనే జైలర్ 2 అప్డేట్.. ప్రోమో కూడా అప్పుడేనా..

జైలర్ సీక్వెల్‌ షూటింగ్‌కు అంతా రెడీ చేసినట్టు తెలుస్తుంది.

Jailer 2 : ఆ స్పెషల్ డేనే జైలర్ 2 అప్డేట్.. ప్రోమో కూడా అప్పుడేనా..

Rajinikanth Nelson Jailer 2 movie promo shoot update

Updated On : November 28, 2024 / 5:16 PM IST

Jailer 2 : సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ అందుకుందో తెలిసిందే. నెల్సన్ దిలీప్‌ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులోని సూపర్ స్టార్ యాక్షన్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా ఇంతటి విజయాన్ని అందుకోవడంతో దీనికి సీక్వెల్ కూడా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అయితే తాజాగా జైలర్ సీక్వెల్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.

జైలర్ సీక్వెల్‌ షూటింగ్‌కు అంతా రెడీ చేసినట్టు తెలుస్తుంది. జైలర్ 2 సినిమాకి సంబందించిన ప్రోమో షూట్‌ను డిసెంబర్‌ 5న చెయ్యనున్నారని తెలుస్తుంది. అంతేకాదు తలైవా పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న జైలర్‌ 2 నుండి ప్రోమో రిలీజ్ చేస్తారట. డిసెంబర్ మొదటి వారం నుండి ఈ సినిమా షూటింగ్ పనులు స్టార్ట్ చేస్తారట. ఇక ఈ సినిమాతో పాటు సూపర్ స్టార్ నుండి వస్తున్న కూలీ సినిమాకి సంబందించిన సరికొత్త పోస్టర్ సైతం రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే జైలర్ 2 స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయిందని నెల్సన్ దిలీప్ కుమార్ క్లారిటీ ఇచ్చారు.

Also Read : Sayani Gupta : ‘డైరెక్టర్ కట్ చెప్పినా ఆగకుండా ముద్దులు పెడుతూనే ఉన్నాడు’.. నటి షాకింగ్ కామెంట్స్

కాగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రానున్న కూలీ సినిమాతో కూడా బిజీగా ఉన్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఈ మూవీ 2025లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. భారీ విజయాన్ని అందుకున్న జైలర్ సినిమాలో రజినీకాంత్ తో పాటు రమ్యకృష్ణ, వినాయకన్‌, వసంత్‌ రవి , మోహన్‌ లాల్‌, శివరాజ్‌ కుమార్‌, తమన్నా కీలక పాత్రల్లో కనిపించారు. జైలర్ కేవలం థియేటర్స్ లోనే కాకుండా ఓటీటీల్లో కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది.