Rajinikanth : నేను జీవితంలో చేసిన అతి పెద్ద త‌ప్పు అదే.. సూప‌ర్ స్టార్ బిరుదుతో ఎప్పుడూ స‌మ‌స్యే : ర‌జినీకాంత్‌

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ (Rajinikanth)హీరోగా న‌టిస్తున్న చిత్రం జైలర్. నెల్సన్‌ దిలీప్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది. త‌మిళ‌, తెలుగు బాష‌ల్లో ఆగ‌స్టు 10న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Rajinikanth

Rajinikanth biggest mistake : సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ (Rajinikanth)హీరోగా న‌టిస్తున్న చిత్రం జైలర్. నెల్సన్‌ దిలీప్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది. త‌మిళ‌, తెలుగు బాష‌ల్లో ఆగ‌స్టు 10న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టింది. అందులో భాగంగా ఇటీవ‌ల ఆడియో ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ర‌జినీకాంత్ స్పీచ్ వైర‌ల్‌గా మారింది.

ఒక‌ప్పుడు తాను మ‌ద్యం తాగేవాడిన‌ని అన్నారు. త‌న జీవితంలో చేసిన అతి పెద్ద త‌ప్పు ఇదేన‌ని చెప్పుకొచ్చారు. ఆరోగ్యం, ఆనందం రెండింటిపై ఇది చాలా తీవ్ర ప్ర‌భావాన్ని చూపించింద‌న్నారు. మ‌ద్యం తాగ‌క‌పోయి ఉండి ఉంటే ఈ రోజు జీవితంలో ఇంత‌కంటే పెద్ద స్టార్‌గా ఉండేవాడిన‌ని అన్నారు. మద్య‌పానానికి దూరంగా ఉండాల‌ని ఈ సంద‌ర్భంగా ర‌జినీకాంత్ అభిమానులను కోరారు.

Yadamma Raju : ఇంకా యాక్సిడెంట్ నుంచి కోలుకొని యాదమ్మ రాజు.. హాస్పిటల్ లో సేవలు చేస్తున్న భార్య..

ఇక సూప‌ర్ స్టార్ అనే బిరుదు త‌న‌కు న‌చ్చ‌ద‌ని ర‌జినీకాంత్ తెలిపారు. అందుక‌నే ఈ సినిమాలోని ‘హుకుం’ పాటను విడుద‌ల చేసిన స‌మ‌యంలో త‌న పేరుకు ముందు వ‌చ్చే సూప‌ర్ స్టార్ ను తీసేయాల‌ని చిత్ర బృందాన్ని కోరిన‌ట్లు ర‌జినీ చెప్పారు. గ‌తంలోనూ కొంత‌మంది ద‌ర్శ‌కుల‌ను త‌న పేరుకు ముందు ఉన్న సూప‌ర్ స్టార్ ప‌దాన్ని తీసేయాల‌ని కోర‌గా వారిలో కొంద‌రు నిరాక‌రించార‌న్నారు. దీని కార‌ణంగా తాను ఎప్పుడూ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్న‌ట్లు చెప్పారు.

ఇక నెల్సన్‌ దిలీప్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డంపైన కూడా ర‌జినీ స్పందించారు. ఇటీవ‌ల విజ‌య్‌, నెల్స‌న్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన బీస్ట్ సినిమాకు నెగెటివ్ టాక్ వ‌చ్చింది. దీంతో జైల‌ర్ సినిమా నుంచి నెల్స‌న్‌ను తొల‌గించార‌నే ఊహాగానాలు సైతం వినిపించాయి. దీనిపై ర‌జినీ మాట్లాడుతూ.. నెగెటివ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆ చిత్రం వ‌ల్ల నిర్మాత‌కు, డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు ఎలాంటి న‌ష్టం వాటిల్ల‌లేద‌న్నారు. ద‌ర్శ‌కుడు తాను న‌మ్మిన క‌థ ప్ర‌కార‌మే సినిమా తీశాడ‌ని చెప్పారు.

ఇదిలా ఉంటే.. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపుదిద్దుకుంటున్న జైల‌ర్ సినిమాను స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో త‌మ‌న్నా (Tamannaah) హీరోయిన్‌. క‌న్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్‌ మోహన్ లాల్(Mohanlal), జాకీ ష్రాఫ్, రమ్య కృష్ణ, సునీల్ లాంటి స్టార్ యాక్టర్స్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Kangana Ranaut : బట్టలు సరిగ్గా వేసుకో.. సౌత్ హీరోలని చూసి నేర్చుకో.. రణవీర్ సింగ్‌కు కంగనా కౌంటర్లు..