Rajinikanth Shankar Sivaji The Boss re release details
Sivaji : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన మొదటి సినిమా ‘శివాజీ ది బాస్’. 2007లో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. శంకర్ నుంచి చివరిగా వచ్చిన మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇదే. ఆ తరువాత నుంచి రోబో, ఐ అంటూ టెక్నికల్ సినిమాల వైపు దారి మళ్ళించాడు. ఇండియాలో ఉన్న బ్లాక్ మనీ, అది బయటకి వస్తే ఎంతమంది బ్రతుకులు బాగుపడతాయనేది.. కమర్షియల్ గా చూపించి శంకర్ అదుర్స్ అనిపించాడు.
శ్రియా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. హీరో సుమన్ విలన్ గా కనిపించాడు. సినిమా చివరిలో రజిని గుండు గెటప్ లో ఎంట్రీ ఇచ్చి, తన డిఫరెంట్ మ్యానరిజమ్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ అందించిన సంగీతం సూపర్ హిట్టుగా నిలిచింది. సుమారు 90 కోట్ల బడ్జెట్ తో ఏవిఎం ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 160 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకొని రికార్డులు సృష్టించింది. అలాగే స్టేట్ నుంచి నేషనల్ వైడ్ ఎన్నో అవార్డులు కూడా అందుకుంది.
Also read :Naga Chaitanya : బాబోయ్ NC23 కోసం చైతన్య వర్క్ అవుట్స్ మూమూలుగా లేవుగా..
కాగా ఈ సినిమాని ఇప్పుడు 4K ప్రింట్ తో రీ రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. డిసెంబర్ 12న రజినీకాంత్ పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే. అయితే బర్త్ డే కంటే ముందే డిసెంబర్ 9న శివాజీని రీ రిలీజ్ చేయబోతున్నారు. మరి యాక్షన్ థ్రిల్లర్ ని అప్పుడు థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు ఉంటే.. ఇప్పుడు 4K ప్రింట్ లో చూసి ఎంజాయ్ చేసేయండి.