Thalaivar170 : రజినీకాంత్ ‘త‌లైవర్ 170’ టైటిల్ టీజర్ రిలీజ్.. వేట మొదలైంది..

నేడు డిసెంబర్ 12 రజిని బర్త్ డే కావడంతో మూవీ టీం ‘త‌లైవర్ 170’ టైటిల్ ని అనౌన్స్ చేసింది.

Rajinikanth Thalaivar170 titled as Vettaiyan teaser released

Thalaivar170 : జైలర్ సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చిన రజినీకాంత్.. తన తదుపరి సినిమాని ‘జై భీమ్‌’ డైరెక్టర్ టి.జె.జ్ఞానవేల్ తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ‘త‌లైవర్ 170’ వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దసరా విజయన్‌, రక్షన్.. వంటి భారీ తారాగణం కనిపించబోతుంది. కాగా నేడు డిసెంబర్ 12 రజిని బర్త్ డే కావడంతో మూవీ టీం ‘త‌లైవర్ 170’ టైటిల్ ని అనౌన్స్ చేసింది.

మూవీ టైటిల్ అనౌన్స్ చేస్తూ ఒక చిన్న టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ‘వేటైయాన్’ అనే టైటిల్ ని అనౌన్స్ చేశారు. మరి ఇతర భాషల్లో వేరే టైటిల్ ని అనౌన్స్ చేస్తారా..? లేదా ఇదే టైటిల్ ని పెడతారా అనేది తెలియాల్సి ఉంది. ‘వేటైయాన్’ అంటే ‘హంటర్’ అనే మీనింగ్ వస్తుందట. ఇక రిలీజ్ చేసిన టీజర్ సూపర్ ఉంది. ఇక ఈ సినిమాలో కూడా రజిని పోలీస్ గానే కనిపించబోతున్నారని టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. టీజర్ చివరిలో ‘వేట మొదలైంది’ అంటూ రజిని చెప్పిన డైలాగ్ విజుల్స్ వేయిస్తుంది. అనిరుద్ ర‌విచంద్ర‌న్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. టీజర్ కి ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది.

Also read : Naatu Naatu : నాటు నాటు స్టెప్ వేసిన అవెంజర్స్ స్టార్ లోకి.. పిక్ వైరల్

ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ.. ఇటీవలే ముంబైలో అమితాబ్ సన్నివేశాలను పూర్తి చేసింది. కాగా రజిని అండ్ అమితాబ్ దాదాపు 33 ఏళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడే ఈ సినిమాలో కలిసి నటిస్తున్నారు. గతంలో 1980లలో అంధాకా నూన్, గిరాఫ్తార్ వంటి బాలీవుడ్ సినిమాల్లో క‌లిసి న‌టించారు. ఆ తరువాత 1991లో రిలీజైన ముకుల్ ఎస్ ఆనంద్ యొక్క ‘హమ్’ కలిసి నటించిన వీరిద్దరూ.. ఆ తరువాత మళ్ళీ మరోసారి ఒకే ఫ్రేమ్ లో కనిపించలేదు. ఇప్పుడు ఇన్నాళ్ల తరువాత ఈ ఇద్దరు లెజెండ్స్ ఓకే ఫ్రేమ్ లో కనిపిస్తుండడంతో ఈ మూవీ పై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి.