Naatu Naatu : నాటు నాటు స్టెప్ వేసిన అవెంజర్స్ స్టార్ లోకి.. పిక్ వైరల్
జపాన్ లో జరుగుతున్న టోకియో కామిక్ కన్ ఈవెంట్ లో నాటు నాటు స్టెప్ వేసిన అవెంజర్స్ స్టార్ లోకి.

Loki star Tom Hiddleston doing Naatu Naatu step in Tokyo comic con event
Naatu Naatu : ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యి ఏళ్ళు గడిచిపోతుంది. కానీ అది సృష్టించిన ప్రభంజనం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో దర్శకధీరుడు రాజమౌళి క్రియేట్ చేసిన మ్యాజిక్ అలాంటిది. ఈ సినిమాలో కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్ లో చంద్రబోస్ లిరిక్స్ అందించగా చంద్రబోస్ డాన్స్ కంపోజ్ చేసిన ‘నాటు నాటు’ సాంగ్ ఎంతటి ప్రజాధారణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసి ఆస్కార్ ని సొంతం చేసుకుంది. ఇక అంతటి సంచలనం సృష్టించిన ఆ పాటకి చిందేయకుండా ఏ ఒక్కరు ఉండలేకపోతున్నారు.
హాలీవుడ్ స్టార్స్ , ప్రపంచ దేశాల అధికారులు కూడా నాటు నాటుకి చిందిస్తూ వావ్ అనిపిస్తున్నారు. తాజాగా అవెంజర్స్ స్టార్ లోకి (Loki) కూడా నాటు నాటు ఐకాన్ డాన్స్ పోస్టర్ లుక్ ఇచ్చి వావ్ అనిపించారు. అవెంజర్స్ లో లోకిగా అలరిస్తున్న హాలీవుడ్ యాక్టర్ ‘టామ్ హిడిల్‌స్టన్’.. ప్రస్తుతం లోకి వెబ్ సిరీస్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు. ఇటీవలే సీజన్ 2 ఆడియన్స్ ముందుకి వచ్చి సూపర్ వ్యూస్ ని అందుకుంది.
తాజాగా ఈ హీరో జపాన్ లో జరుగుతున్న టోకియో కామిక్ కన్ ఈవెంట్ లో సందడి చేశారు. అక్కడ నాటు నాటు పోస్టర్ స్టెప్ ని రీ క్రియేట్ చేసి జపాన్ ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట బాగా వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే, నాటు నాటుకి లిరిక్స్ అందించిన చంద్రబోస్ ఆస్కార్ గెలుచుకోవడం పై చిల్కూరి సుశీల్‌రావు ఒక డాక్యుమెంటరీని తెరకెక్కించారు.
Also read : Spirit : ప్రభాస్ సినిమాలో యానిమల్ బ్యూటీ.. సందీప్ వంగ ఏమన్నారంటే..?
Actor Tom Hiddleston(Loki) with Naatu Naatu step.@AlwaysRamCharan @RRRMovie @tarak9999 #GameChanger pic.twitter.com/n7vTmjQMIz
— Xavier club Game Changer ™ (@s_siechojithu) December 11, 2023
‘ఆస్కార్ చల్లగరిగ’ అనే టైటిల్ తో తెరకెక్కిన డాక్యుమెంటరీలో.. ఆస్కార్ గెలుచుకున్న తరువాత చంద్రబోస్ తన సొంత ఊరుకి వెళ్ళినప్పుడు జరిగిన సంబరాలు, అనుభూతులను చూపిస్తూ రూపొందించారు. తాజాగా ఈ డాక్యుమెంటరీ ఫ్రాన్స్‌లో నిర్వహించే నెలవారీ కేన్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి ఎంపికైంది. అలాగే ముంబైలో నిర్వహించిన షార్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ఈ డాక్యుమెంటరీ అవార్డుని గెలుచుకుంది.