Spirit : ప్రభాస్ సినిమాలో యానిమల్ బ్యూటీ.. సందీప్ వంగ ఏమన్నారంటే..?

ప్రభాస్ స్పిరిట్ సినిమాలో యానిమల్ బ్యూటీని హీరోయిన్ గా తీసుకోవాలని సందీప్ వంగకి రిక్వెస్ట్‌లు వెళ్లుతున్నాయట.

Spirit : ప్రభాస్ సినిమాలో యానిమల్ బ్యూటీ.. సందీప్ వంగ ఏమన్నారంటే..?

Tollywood Audience want Animal Heroine Tripti Dimri in Prabhas Spirit

Updated On : December 12, 2023 / 3:03 PM IST

Spirit : రెబల్ స్టార్ ప్రభాస్, టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ వంగ కాంబినేషన్ లో ‘స్పిరిట్’ అనే మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఆ మూవీ కోసం ప్రభాస్ అభిమానులు ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక రీసెంట్ గా సందీప్ వంగ డైరెక్ట్ చేసిన ‘యానిమల్’ భారీ విజయాన్ని అందుకోవడంతో.. రెబల్ ఫ్యాన్స్ లో స్పిరిట్ పై మరింత క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. దీంతో స్పిరిట్ మూవీ ఎలా ఉండబోతుంది..? ఆ మూవీలో ప్రభాస్ తో పాటు ఏ నటీనటులు నటించబోతున్నారు..? అనే ప్రశ్నలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి.

ఇక కొంతమంది అభిమానులు అయితే.. ఈ ప్రశ్నలతో పాటు జవాబులు కూడా వారే ఇస్తూ వాటిని నిజం చేయమని రిక్వెస్ట్ లు పెడుతున్నారు. ఈక్రమంలోనే స్పిరిట్ మూవీలో ప్రభాస్ కి హీరోయిన్ గా ఆ అందాల భామని తీసుకోమని సందీప్ వంగకి మెసేజ్‌లు, రిక్వెస్ట్‌లు వెళ్లుతున్నాయట. ఈ విషయాన్ని సందీప్ వంగ స్వయంగా తెలియజేశారు.
సందీప్ వంగ డైరెక్ట్ చేసిన రీసెంట్ మూవీ ‘యానిమల్’లో రష్మిక, తృప్తి దిమ్రీ హీరోయిన్స్ గా నటించారు. మెయిన్ హీరోయిన్ రష్మిక అయినప్పటికీ.. సెకండ్ హీరోయిన్ తృప్తికి బాగా ఫేమ్ వచ్చింది.

Also read : Kantara 2 Movie : కాంతార 2 సినిమాలో నటిద్దామనుకుంటున్నారా? అయితే ఈ ఛాన్స్ మీ కోసమే..

మూవీలో అమ్మడి అందాలకు ఆడియన్స్ ఫిదా అయ్యిపోయారు. దీంతో యూత్ లో తృప్తికి భారీ క్రేజ్ వచ్చింది. ఆ భామని తెలుగు సినిమాల్లో కూడా చూడాలని టాలీవుడ్ యూత్ కోరుకుంటున్నారు. ఈక్రమంలోనే సందీప్ డైరెక్ట్ చేయబోయే ప్రభాస్ స్పిరిట్ లోనే ఆమెను హీరోయిన్ గా తీసుకోమని సలహాలు ఇస్తున్నారు. స్పిరిట్ లో తృప్తిని ప్రభాస్ కి హీరోయిన్ గా తీసుకోమని నాకు మెసేజ్ లు వస్తున్నాయని చెప్పిన సందీప్ వంగ.. ఈ రిక్వెస్ట్ లను సీరియస్ గా తీసుకోని తృప్తిని ప్రభాస్ కి హీరోయిన్ గా చేస్తారా లేదా చూడాలి. కాగా స్పిరిట్ మూవీ షూటింగ్ 2024 సెప్టెంబర్‌లో మొదలు కాబోతుందంటూ ఇటీవల సందీప్ వంగ తెలియజేశారు.