Rajinikanth : బాలాజీని దర్శించుకున్న బాషా..
సూపర్ స్టార్ రజినికాంత్ ప్రస్తుతం 'జైలర్' సినిమాలో నటిస్తున్నాడు. మొన్ననే రజిని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు మేకర్స్. కాగా ఈరోజు తెల్లవారుజామున రజినీకాంత్...
- gum 95921
- Published On : December 15, 2022 / 07:27 AM IST
Rajinikanth visited Tirumala Tirupati Venkateswara Swami
Rajinikanth : సూపర్ స్టార్ రజినికాంత్ ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. ప్రస్తుతం రజినీకాంత్ ‘జైలర్’ సినిమాలో నటిస్తున్నాడు. మొన్ననే రజిని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు మేకర్స్. బీస్ట్ ఫేమ్ నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది సమ్మర్ రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఒక ముఖ్యపాత్రలో కనిపిస్తున్నాడు.
Rajinikanth : సైలెంట్ సునామి సృష్టించిన ‘జైలర్’..
కాగా ఈరోజు తెల్లవారుజామున రజినీకాంత్ మరియు అతని కూతురు ఐశ్వర్య తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన పాల్గొని, వెంకన్నని మొక్కుకున్నారు. బాలాజీ దర్శనానికి వచ్చిన బాషాని ఆలయ నిర్వాహుకులు.. ఆలయ మర్యాదల మధ్య సూపర్ స్టార్ రజినికాంత్ కి ఘనంగా స్వాగతం పలికారు.
ఇక ఐశ్వర్య రజినీకాంత్ దర్శకురాలిగా తన మూడో చిత్రాన్ని ప్రారంభించింది. విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రజినీకాంత్ అతిధి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.
