Rajinikanth : నాని డైరెక్టర్ తో రజినీకాంత్ సినిమా..? నిజంగా జరుగుతుందా?

తాజాగా ఓ ఆసక్తికర కాంబో గురించి సినీ పరిశ్రమలో వినిపిస్తుంది.

Rajinikanth will Do a Film with Vivek Athreya Rumors goes Viral

Rajinikanth : 70 ఏళ్ళు దాటినా రజినీకాంత్ ఇంకా యువకుడిలా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. పైగా ఆల్మోస్ట్ యువ దర్శకులతోనే సినిమాలు చేస్తున్నారు రజినీకాంత్. తాజాగా ఓ ఆసక్తికర కాంబో గురించి సినీ పరిశ్రమలో వినిపిస్తుంది.

నానితో అంటే సుందరానికి, సరిపోదా శనివారం లాంటి సినిమాలు తీసిన వివేక్ ఆత్రేయ రజినీకాంత్ తో సినిమా తీయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వివేక్ ఆత్రేయ రజినీకాంత్ కి కథ చెప్పాడని, రజిని కూడా ఓకే చెప్పాడని అంటున్నారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారని తెలుస్తుంది. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ నిజమైతే మాత్రం ఆ సినిమా అదిరిపోతుంది అంటున్నారు ఫ్యాన్స్, ప్రేక్షకులు.

Also Read : Vasudheva Sutham : దేవి సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ మహేంద్రన్ హీరోగా ‘వసుదేవ సుతం’.. గ్లింప్స్ రిలీజ్..

వివేక్ ఆత్రేయ సినిమాలకు, అతని స్క్రీన్ ప్లేకి అభిమానులు ఉన్నారు. మరి రజినితో ఎలాంటి సినిమా తీస్తాడో చూడాలి. అలాగే స్టార్ డైరెక్టర్ మణిరత్నం థగ్ లైఫ్ తర్వాత ఓ సినిమా చేయబోతున్నాడని, ఆ సినిమాలో నవీన్ పోలిశెట్టి ఒక కీ రోల్ ప్లే చేస్తాడని మరో వార్త వినిపిస్తుంది.