Vasudheva Sutham : దేవి సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ మహేంద్రన్ హీరోగా ‘వసుదేవ సుతం’.. గ్లింప్స్ రిలీజ్..
తాజాగా వసుదేవ సుతం సినిమా గ్లింప్స్ ని మెలోడీ బ్రహ్మ మణిశర్మ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

Master Mahendran Vasudheva Sutham Movie Glimpse Released
Vasudheva Sutham : సౌత్ లో అనేక సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన మాస్టర్ మహేంద్రన్ ఇప్పుడు నటుడిగా, హీరోగా తమిళ్ లో సినిమాలు చేస్తున్నాడు. దేవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు కూడా అందుకున్నాడు. ఇప్పుడు తెలుగులో కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు మహేంద్రన్. మాస్టర్ మహేంద్రన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా వసుదేవ సుతం. బేబీ చైత్ర శ్రీ, మాస్టర్ యువాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో వైకుంఠ్ బోను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
తాజాగా వసుదేవ సుతం సినిమా గ్లింప్స్ ని మెలోడీ బ్రహ్మ మణిశర్మ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే ఓ జగన్నాధుడి గుడి, అందులో పాము ఉన్నాయి. గుడి చుట్టూ తిరిగే మైథలాజికల్ మూవీ అని తెలుస్తుంది. గ్లింప్స్‌తోనే సినిమాపై ఆసక్తి నెలకొంది. మీరు కూడా ఈ గ్లింప్స్ చూసేయండి..
Also Read : Supritha : హాస్పిటల్ బెడ్ పై సురేఖవాణి కూతురు సుప్రీత.. చేతికి సెలైన్ పెట్టి.. పోస్ట్ వైరల్..
ఈ సినిమాకి మణిశర్మనే మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాని తెలుగు, తమిళ, హిందీ, ఒరియా భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. అంబికావాణి, జాన్ విజయ్, మైమ్ గోపి, సురేష్‌చంద్ర మీనన్, ఐశ్వర్యలక్ష్మి, తులసి, రాజీవ్ కనకాల, టార్జన్, భధ్రమ్.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.