Supritha : హాస్పిటల్ బెడ్ పై సురేఖవాణి కూతురు సుప్రీత.. చేతికి సెలైన్ పెట్టి.. పోస్ట్ వైరల్..
తాజాగా సుప్రీత హాస్పిటల్ బెడ్ పై సెలైన్ ఎక్కించుకొని ఉన్న ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Actress Surekha Vani Daughter Supritha Shares Photos from Hospital bed with saline
Supritha : నటి సురేఖవాణి కూతురు సుప్రీత త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పటికే మూడు సినిమాల్లో నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోజులతో ఫాలోవర్స్, ఫ్యాన్స్ ని సంపాదించుకుంది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతూ యాక్టివ్ గా ఉంటుంది సుప్రీత. తాజాగా సుప్రీత హాస్పిటల్ బెడ్ పై సెలైన్ ఎక్కించుకొని ఉన్న ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Also Read : Tejaswini Vygha : పారిస్ లో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న దిల్ రాజు భార్య.. తేజస్విని ఫొటోలు చూశారా?
సుప్రీత తాజాగా హాస్పిటల్ లో సెలైన్ ఎక్కించుకొని ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. దిష్టి నిజమే. ఈ వారం జీవితంలో నేను బలంగా ఎలా ఉండాలో ఆలోచించాను. నేను శివయ్యను నమ్ముతాను. కానీ ఆయనకు నా మీద కోపం వచ్చినట్టు ఉంది. అయినా శివయ్య, మా అమ్మ, ప్రసన్న, రమణ లేకుండా వీళ్ళు లేకుండా నేను లేను. జీవితం ఎప్పుడూ నన్ను పరీక్షిస్తుంది. దిష్టి నా మానసిక ఆరోగ్యాన్ని, నా శారీరిక ఆరోగ్యాన్ని ఎఫెక్ట్ చేసింది. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం ఎల్లప్పుడూ ముఖ్యం అని రాసుకొచ్చింది.
Also Read : Vijay Deverakonda : ఆ మ్యాగజైన్ కోసం విజయ్ దేవరకొండ స్టైలిష్ పోజులు.. కింగ్డమ్ లుక్ లో అదరగొట్టాడుగా..
దీంతో సుప్రీత పోస్ట్ వైరల్ అవ్వగా ఏమైంది, ఇప్పుడు హెల్త్ ఓకే నా, హెల్త్ జాగ్రత్త, త్వరగా కోలుకోవాలి అని ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.