Rajinikanth : మనవళ్లుతో రజినీకాంత్ దివాళీ సెలబ్రేషన్స్..

సూపర్ స్టార్ రజినీకాంత్ మనవళ్లు బయట పెద్దగా కనిపించరు. తాజాగా రజినీ తన మనవళ్లుతో కలిసి దివాళీ పండుగని..

Rajinikanth with his daughters and grand sons in diwali bash

Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఇద్దరి కూతుళ్లు ఉన్న సంగతి, వీరికి పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే సూపర్ స్టార్ మనవళ్లు బయట పెద్దగా కనిపించరు. తాజాగా రజినీ తన మనవళ్లుతో కలిసి దివాళీ పండుగని సెలబ్రేట్ చేసుకున్నారు. తాతయ్యకి నమస్కరించి ఆయన అశీసులు తీసుకుంటున్న మనవళ్ల ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.

అలాగే రజినీ కూతుళ్లు ఐశ్వర్యా, సౌందర్య, రజినీ సిస్టర్ లతా.. ఈ దివాళీ వేడుకలో కనిపించి సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఇక దివాళీ రోజు రజినీకాంత్ కి విషెస్ తెలియజేయడానికి వచ్చిన అభిమానులను కూడా సూపర్ స్టార్ పలకరించారు. ఇంటి గేటు ధాటి బయటకి వచ్చి ఫ్యాన్స్ కి తాను విషెస్ తెలియజేశారు.

Also read : Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ అతనితో డేటింగ్‌లో ఉందా..?

ఇక రజినీ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తలైవర్ 170 సినిమా షూటింగ్ జరుగుతుంది. ‘జై భీమ్‌’ డైరెక్టర్ టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దసరా విజయన్‌, రక్షన్ లు వంటి భారీ తారాగణం కనిపించబోతుంది. ఇటీవలే ముంబై షెడ్యూల్ పూర్తి చేసుకొని చెన్నైలో జరిగే షెడ్యూల్ కోసం సిద్దమవుతుంది.

ఈ చిత్రంతో పాటు కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో చేసిన ‘లాల్ సలామ్’ సినిమాలో కూడా రజినీ నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. దేవాలి కానుకగా ఈ మూవీ టీజర్ ని కూడా రీసెంట్ గా రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.