Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ అతనితో డేటింగ్‌లో ఉందా..?

బాలీవుడ్ ర్యాప్ సింగర్ బాద్‌షాతో మృణాల్ ఠాకూర్ డేటింగ్ లో ఉందట. దానికి సాక్ష్యం చూపిస్తూ ఒక వీడియోని కూడా వైరల్ చేస్తున్నారు.

Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ అతనితో డేటింగ్‌లో ఉందా..?

Mrunal Thakur Badshah dating rumour video gone viral

Updated On : November 13, 2023 / 5:14 PM IST

Mrunal Thakur : బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ ప్రేమ, పెళ్లి రూమర్స్ రోజు ఒకటి పుట్టుకొస్తూ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఒక వేదిక పై మృణాల్‌తో అల్లు అరవింద్ చేసిన పెళ్లి కామెంట్స్ వైరల్ గా మారి.. త్వరలోనే తెలుగు అబ్బాయితో మృణాల్ పెళ్లంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక వీటిపై ఒక క్లారిటీ ఇస్తూ మృణాల్ ఒక వీడియో కూడా చేశారు. ఆ రూమర్ కి ఎండ్ కార్డు పడింది అనుకుంటే ఇప్పుడు మరో కొత్త రూమర్ చక్కర్లు కొడుతోంది. ఆ రూమర్ ఏంటంటే.. బాలీవుడ్ ర్యాప్ సింగర్ బాద్‌షాతో మృణాల్ ఠాకూర్ డేటింగ్ లో ఉందట.

Also read : Mrunal Thakur : తెలుగు అబ్బాయితో మృణాల్ పెళ్లి.. మృణాల్ ఇన్‌స్టా వీడియో వైరల్..

దానికి సాక్ష్యం చూపిస్తూ ఒక వీడియోని కూడా వైరల్ చేస్తున్నారు. ఇటీవల హీరోయిన్ శిల్పా శెట్టి ఇంటిలో జరిగిన దివాళీ బ్యాష్ ఈవెంట్ కి మృణాల్ ఠాకూర్, బాద్‌షా అతిథులుగా హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో శిల్పా, బాద్‌షాతో కలిసి ఉన్న ఫోటోని మృణాల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. “ఇద్దరు ఇష్టమైన వ్యక్తులు” అంటూ రాసుకొచ్చారు. ఇక ఆ ఈవెంట్ నుంచి మృణాల్ వెళ్లిపోయే సమయంలో బాద్‌షా చెయ్యి పట్టుకొని కనిపించారు. ఈ విషయమే డేటింగ్ రూమర్స్ పుట్టడానికి కారణమయ్యాయి.

Mrunal Thakur Badshah dating rumour video gone viral

అయితే ఇవి కేవలం రూమర్సే మాత్రమే అని అర్ధమవుతున్నాయి. ఎందుకంటే గతంలో బాద్‌షా, మృణాల్ కలిసి ఒక ఆల్బమ్ సాంగ్ కోసం పని చేశారు. అప్పటి నుంచి ఇద్దరు మధ్య మంచి స్నేహమే ఉంది. ఆ వీడియోలో కూడా మృణాల్ పార్టీ నుంచి వెళ్లే సమయంలోనే బాద్‌షా చెయ్యి పట్టుకున్నారు. అదికూడా గుడ్ బై చెప్పే తరహాలో అన్నట్లు కనిపిస్తుంది. మరి మృణాల్ ఈ రూమర్స్ కి మొన్నటిలా సమాధానం ఇస్తారా..? లేదా లైట్ తీసుకుంటారా..? అనేది చూడాలి. అసలు ఈ డేటింగ్ రూమర్స్ కి కారణమైన ఆ వీడియో వైపు మీరుకూడా ఒక లుక్ వేసేయండి.