Rajnikanth’s health condition stable : హై బీపీతో అపోలో ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ రజనీ (Rajinikanth) అభిమానులకు వైద్యులు శుభవార్త అందించారు. రజనీకాంత్ కు సంబంధించిన అన్ని రిపోర్టులు నార్మల్ గా ఉన్నాయని… అపోలో ఆసుపత్రి (Apollo Hospital) హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 2020, డిసెంబర్ 27వ తేదీ ఆదివారం మధ్యాహ్నం మరోసారి వైద్యులు పరీక్షించిన తర్వాత రజనీ డిశ్చార్జ్ పై నిర్ణయం తీసుకుంటారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అటు ఆదివారం సాయంత్రం రజనీ డిశ్చార్జ్ అవుతారన్న వార్తలొస్తుండడంతో… బేగంపేట విమానాశ్రయం (begumpet airport)లో ఆయన చార్టెడ్ ఫ్లైట్‌ను సిద్ధం చేస్తున్నారు సిబ్బంది. ఈ సాయంత్రం 6 గంటలకు బేగంపేట నుంచి చెన్నై బయలుదేరుతారని రజనీ సిబ్బంది చెబుతున్నారు.
రజిని డిశ్చార్జ్ : –
సూపర్ స్టార్ రజినీకాంత్ నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందంటూ హైదరాబాద్ అపోలో ఆస్పత్రి యాజమాన్యం (Apollo Hospital) ప్రకటించింది. హెల్త్ బులెటిన్ (Health Bulletin) విడుదల చేసింది. బీపీ అదుపులోనే ఉందని… ఇప్పటి వరకు చేసిన వైద్య పరీక్షల్లో ఎలాంటి ఆందోళనరమైన అంశాలు లేవని గుడ్‌న్యూస్ చెప్పింది. రజనీకి మరికొన్ని పరీక్షలు చేశామని.. వాటి రిపోర్టులు రావాల్సి ఉందని డాక్టర్లు తెలిపారు. ఆ వైద్య పరీక్షల నివేదికలతో పాటు బీపీ స్టేటస్‌ను చూసిన తర్వాత.. రజినీకాంత్‌ను డిశ్చార్జిపై ఇవాళ నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
డిసెంబర్ 22 కరోనా పరీక్షలు : –
హైబీపీతో శుక్రవారం ఉదయం హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో రజినీ అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. రజినీకాంత్ (Rajinikanth)కుమార్తె సౌందర్య… తండ్రి దగ్గరే ఉండి సపర్యలు చేస్తున్నారు. రజినీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న చాలామంది అభిమానులు చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలివస్తున్నారు. తలైవా గత 10 రోజులుగా హైదరాబాద్‌లోనే ఉన్నారు. అన్నాత్తై షూటింగ్ కోసం ఆయన నగరానికి వచ్చారు. ఈ చిత్ర యూనిట్‌లో పలువురికి కరోనా పాజిటివ్ రావడంతో రజినీకాంత్ క్వారంటైన్‌కు వెళ్లారు. డిసెంబరు 22న రజినీకాంత్‌కు కరోనా పరీక్షలు చేస్తే నెగెటివ్ వచ్చింది. ఎలాంటి కరోనా (Corona) లక్షణాలు కూడా లేవు. అయితే శుక్రవారం ఉదయం ఒక్కసారిగా బీపీ పెరగడంతో ఆయన అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక బృందం మానిటర్ చేస్తోంది.
క్షేమంగా రావాలని ప్రార్థనలు : –
సూపర్ స్టార్ రజినీకాంత్ అస్వస్థతకు గురయ్యారన్న వార్త ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ మాత్రమే.. భారత సినీ పరిశ్రమను షేక్ చేసింది. హైబీపీతో జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రి (Jublihills Apolo Hospital)లో చేరారన్న వార్త వినగానే అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఆయన ఆరోగ్యంపై అభిమానులు, తారలు టెన్షన్ పడుతున్నారు. తమ అభిమాన నటుడికి ఏమీ కాకూడదని.. త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. రజినీకాంత్ క్షేమంగా తిరిగి రావాలని సోషల్ మీడియాలో ట్వీట్స్ పోస్ట్ చేస్తున్నారు. సాధారణ అభిమానులతో పాటు సినీ తారలు, క్రీడా ప్రముఖులు కోసం రజినీ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.