Rakesh Master Chaitanya master life ends article in telugu
Rakesh Master : టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఢీ డాన్స్ మాస్టర్ చైతన్య మరణవార్త అందర్నీ కలిచి వేసింది. ఇప్పుడు అదే ఢీ షోలో ఒకప్పుడు డాన్స్ మాస్టర్ గా చేసిన రాకేశ్ మాస్టర్ కూడా మరణించడం డాన్సర్స్ లో విషాదం చోటు చేసుకుంటుంది. ఢీ షోలో కోరియోగ్రఫీ చేస్తూ వచ్చిన చైతన్య.. తన డాన్స్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫేమ్ ని సంపాదించుకున్నాడు. దీంతో పలు ప్రముఖ సిటీలో ప్రత్యకే షోలు ఇచ్చే అవకాశాలు కూడా అందుకున్నాడు.
Rakesh Master : రాకేశ్ మాస్టర్ – శేఖర్ మాస్టర్ గొడవ ఏంటి..? అసలు వారిద్దరి మధ్య ఏమైంది..!
అయితే ఆ ఫేమ్ తనని ఆర్ధికంగా ఆదుకోలేక పోయిందని. ఢీ షోలో సంపాదన చాలా తక్కువ ఇస్తున్నారని, ఢీ కంటే జబర్దస్త్ షోలోనే ఎక్కువ మనీ ఇస్తారంటూ.. ఒక సెల్ఫీ వీడియో చేసి ఆత్మహత్య (ఏప్రిల్ 29) చేసుకోవడం తోటి డాన్సర్స్ ని తీవ్రంగా బాధ పెట్టింది. ఆ విషాదం నుంచి కోలుకముందే ఇప్పుడు రాకేశ్ మాస్టర్ మరణం వారిని శోకసంద్రంలోకి నెట్టేస్తుంది. రాకేశ్ మాస్టర్ అనారోగ్య సమస్యతో చనిపోయారు. రెండు నెల్లలు క్రిందటే ఒక మూవీ షూటింగ్ సమయంలో వాంతులు, విరోచనాలు అవ్వడంతో హాస్పిటల్ కి తీసుకు వెళ్లగా.. ఆయన ఎక్కువ కాలం బ్రతకరని, జాగ్రత్తగా చూసుకోమని డాక్టర్లు తెలియజేశారు.
Rakesh Master : ప్రభుదేవాతో రాకేశ్ మాస్టర్ గొడవ ఏంటో తెలుసా..? పబ్లిక్‌గా సవాల్ విసిరి!
ఇక ఈరోజు ఉదయం రక్త విరోచనాలు అవ్వడంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో సాయంత్ర 5 గంటల సమయంలో మరణించారు. కాగా రాకేశ్ మాస్టర్ దాదాపు 1500 చిత్రాలకు పైగా కోరియోగ్రఫీ చేశారు. ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్స్ గా కొనసాగుతున్న ఎంతోమంది రాకేష్ మాస్టర్ దగ్గర శిష్యరికం చేసినవారే. వారిలో జానీ మాస్టర్ (Jani Master), శేఖర్ మాస్టర్ (Sekhar) కూడా ఉన్నారు. అంతేకాదు వేణు, మణిచందన, ప్రభాస్, ప్రత్యూష వంటి స్టార్స్ డాన్స్ పాఠాలు కూడా నేర్పించారు.