Jithendar Reddy : 75 రూపాయలకే సినిమా.. జితేందర్ రెడ్డి బయోపిక్..

రాకేష్ వర్రే టైటిల్ రోల్ పోషిస్తున్న జితేందర్ రెడ్డి సినిమా పలుమార్లు వాయిదా పడి ఇప్పుడు నవంబర్ 8న రిలీజ్ కానుంది.

Rakesh Varre Announce Jithendar Reddy Movie Tickets Offer

Jithendar Reddy : రాకేష్ వర్రే టైటిల్ రోల్ పోషిస్తున్న జితేందర్ రెడ్డి సినిమా పలుమార్లు వాయిదా పడి ఇప్పుడు నవంబర్ 8న రిలీజ్ కానుంది. ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాల డైరెక్టర్ విరించి వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

అయితే ఈ ఈవెంట్లో హీరో రాకేష్ వర్రే మాట్లాడుతూ.. ఎవరికీ చెప్పొద్దు సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేయాలి కానీ కొత్తవాళ్లను ఎంకరేజ్ చేసి నిర్మాతగా ఒక సినిమా చేసాను. నేను చేసిన తప్పు అదే. ఇకపై నాకు పేరు వచ్చేదాకా మళ్ళీ నిర్మాతగా సినిమాలు చేయను. అలాగే సెలబ్రిటీలు పిలిస్తే ఈవెంట్ కు ఎవరూ రారు, ఎవరూ సపోర్ట్ చేయరు. సినిమా రిలీజ్ చేయడానికి చాలా కష్టాలు పడ్డాము. అనేకసార్లు వాయిదా పడి ఇప్పుడొస్తుంది. జితేందర్ రెడ్డి గారు ఒక ఫైటర్. అయన అభిమానులు ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తారు. ఈ సినిమాకి 75 రూపాయలతోనే ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు.

Also Read : Vijay Deverakonda : దుల్కర్ బ్యూటీతో రౌడీ హీరో.. విజయ్ స్పెషల్ సాంగ్ చేయబోతున్నాడా..

డైరెక్టర్ విరించి వర్మ మాట్లాడుతూ.. జితేందర్ రెడ్డి గారి కథ విన్నాక నేను ఈ సినిమా చేయాలనే డిసైడ్ అయ్యాను. ఈ సినిమా చేయడం నా లక్కీగా అభవిస్తున్నాను. ఈ సినిమా నిర్మాత వారి సోదరుడి కథ చెపుదాం అని ముందుకొచ్చారు. రాకేష్ నటించడమే కాకుండా నిర్మాణంలో కూడా హెల్ప్ చేసాడు అని తెలిపారు.

నిర్మాత రవీందర్ రెడ్డి గారు మాట్లాడుతూ.. నేనే తక్కువ సినిమాలు చూసే వాడిని కానీ నేను ఈ సినిమా తీశాను. ఈ విషయంలో తృప్తి ఉంది నాకు. నేను ఏదైతే చెప్పాలని అనుకున్నానో దాన్ని మీ అందరికీ చూపించే ప్రయత్నం చేశాను. జితేందర్ రెడ్డి జీవితం ఒక చరిత్ర. ఆ కథని చాలా బాగా చూపించారు. జగిత్యాలలో ప్రీమియర్ వేస్తే చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్నారు అని అన్నారు.