Rakesh Varre Virinchi Varma Jithender Reddy Movie Release Date Announced
Jithender Reddy : ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మాతగా ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాల ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జితేందర్ రెడ్డి. నటుడు రాకేష్ వర్రె టైటిల్ రోల్ లో పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో వైశాలి రాజ్, రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.
Also Read : Prabhas : ప్రభాస్ పుట్టిన రోజుకు స్పెషల్ ఇంటర్వ్యూ.. ప్రోమో చూశారా..? ప్రభాస్‌కి ఇంత సాహిత్యం వచ్చా..?
1980 కాలంలో జగిత్యాల చుట్టుపక్కల జరిగిన రాజకీయ సంఘటనల ఆధారంగా, జితేందర్ రెడ్డి అనే నాయకుడి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. కాలేజీ రోజుల నుంచే ప్రజా సమస్యల కోసం పోరాడుతూ నక్సలైట్ల తో జితేందర్ రెడ్డి చేసిన పోరాటం, తర్వాత అతను రాజకీయాల్లోకి రావడం.. వంటి అంశాలతో జితేందర్ రెడ్డి జీవితకథతో ఈ సినిమాని తెరకెక్కించారు. పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్, గ్లింప్స్ రిలీజ్ చేసారు.