Rakul Preet Singh: సీమ ఓబులమ్మగా రకుల్.. ఫస్ట్‌లుక్ రిలీజ్
రకుల్ ప్రీత్ సింగ్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు… తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీలలో వరసపెట్టి క్రేజీ సినిమాలలో నటిస్తుంది.

Rakul Preet Singh
Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు… తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీలలో వరసపెట్టి క్రేజీ సినిమాలలో నటిస్తుంది. రకుల్ చేతిలో ప్రస్తుతం ఎనిమిది సినిమాలుండగా అందులో కొండపోలం అనే సినిమా కూడా ఒకటి. ఇందులో రకుల్ రాయలసీమ ఓబులమ్మగా కనిపించనుంది. క్రిష్ దర్శకత్వంలో వైష్ణమ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఈ మధ్యనే విడుదలైన సంగతి తెలిసిందే.
కాగా, సోమవారం రకుల్ ప్రీత్ సింగ్ లుక్ కూడా విడుదల చేశారు. ఓబులమ్మగా రకుల్ లుక్ ఇప్పుడు ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటుండగా సినిమా మీద అంచనాలు పెంచేసింది. నీలో నాలో అంటూ సంగీతం కథలో డెప్త్ తెలిపేదిగా మారింది. కథా రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి గారి నవల ‘కొండపొలం’ ఆధారంగా చేసుకొని ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినా కరోనా కారణంగా వాయిదా పడింది.
View this post on Instagram
అక్టోబర్ 8న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ రీసెంట్‌గా ప్రకటించగా.. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ కూడా పూర్తిచేసుకున్నట్లు వినిపిస్తుంది. మొదటి సినిమా ఉప్పెనతో వైష్ణవ్ తేజ్ ఏకంగా 78 కోట్లు కలెక్ట్ చేయగా దాని ప్రభావంతో కొండపోలం సినిమాకు మంచి మార్కెట్ క్రియేట్ అయిందని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా పాటలు విడుదల కానుండగా కీరవాణి సంగీతం ఈ సినిమాకు మరింత ప్లస్ కానుందని చెప్తున్నారు.