‘అర్బన్ కిసాన్’.. మా ఇంటి పంట.. సమంత ఛాలెంజ్ పూర్తి చేసిన రకుల్..

  • Publish Date - August 26, 2020 / 02:50 PM IST

Rakul Urban Kisaan: క‌రోనా వైర‌స్ వ‌ల్ల విధించిన లాక్‌డౌన్ ఇప్పుడిప్పుడే స‌డ‌లుతుంది. సినీ స్టార్స్ అంద‌రూ షూటింగ్స్ చేయ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు. అయితే లాక్‌డౌన్ కారణంగా లభించిన విరామ సమయాన్ని మ‌న స్టార్స్ బాగానే ఉప‌యోగించుకున్నారు. అలా లాక్‌డౌన్ స‌మ‌యాన్ని క‌రెక్ట్‌గా వినియోగించుకున్నస్టార్స్‌లో స‌మంత కూడా ఉన్నారు.



యోగా, ధ్యానం చేస్తూ ఆరోగ్యంపై మరింత దృష్టి పెట్టిన సమంత తన ఇంటిపై వ్యవసాయం కూడా చేస్తున్నారు. ఇంట్లోకి కావాల్సిన కాయగూరలు తనే స్వయంగా పండించుకుంటున్నారు సామ్.
https://10tv.in/sooryavanshi-and-83-will-release-on-ott/
‘గ్రో విత్ మీ’ అంటూ త‌న‌లాగే వ్య‌వ‌సాయం చేయాల‌ని ల‌క్ష్మీ మంచు, ర‌కుల్ ప్రీత్‌ల‌కు సామ్ ఛాలెంజ్ విసిరారు. ర‌కుల్ ఈ ఛాలెంజ్‌ను స్వీక‌రించ‌డ‌మే కాకుండా.. పూర్తి కూడా చేశారు. తాను ఏయే కాయగూర‌ల‌ను పండించిందో కూడా ర‌కుల్ వివ‌రించారు. తనను నామినేట్ చేసినందుకు సమంతకు థ్యాంక్స్ తెలిపారు రకుల్.