Pawan-Charan-Bunny: ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు.. చూడటానికి ఎంత బాగుందో.. పవన్, చరణ్, బన్నీ ఫోటో వైరల్

టాలీవుడ్ లెజెండరీ హాస్య నటుడు అల్లు రామలింగయ్య సతీమణి,(Pawan-Charan-Bunny) అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నం ఇటీవల కాలం చేసిన విషయం తెలిసిందే.

Pawan-Charan-Bunny: ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు.. చూడటానికి ఎంత బాగుందో.. పవన్, చరణ్, బన్నీ ఫోటో వైరల్

Pawan, Charan, Bunny's photo is trending on social media

Updated On : September 9, 2025 / 8:44 AM IST

Pawan-Charan-Bunny: టాలీవుడ్ లెజెండరీ హాస్య నటుడు అల్లు రామలింగయ్య సతీమణి, అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నం ఇటీవల కాలం చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే సోమవారం(సెప్టెంబర్ 08) ఆమె పెద్ద కర్మను కార్యక్రమాన్ని నిర్వహించారు కుటుంబ సంభ్యులు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, నాగ బాబు, నిహారిక, సాయి ధరమ్ తేజ్, అకిరా హాజరయ్యారు. అలాగే బీఆర్ఎస్ నేత కేటీఆర్ కూడా హాజరై అల్లు కనకరత్నం కు నివాళులు అర్పించారు. దీనికి సంబందించిన ఫోటోలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Kajal Agarwal: కాజల్ అగర్వాల్ కి యాక్సిడెంట్.. దేవుడి దయవల్ల అంటూ సోషల్ మీడియాలో పోస్ట్

వాటిలో ఒక ఫోటో మాత్రం చాలా ట్రెండ్ అవుతోంది. అదే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఒక ఫ్రేమ్ లో ఉన్న ఫోటో. ఈ ముగ్గురు(Pawan-Charan-Bunny) ఒకే ఫ్రేమ్ లో కనిపించి చాలా కాలం అయింది. దాంతో, ఈ ఫోటో రిలీజ్ అయిన వెంటనే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. మీ ముగ్గురిని ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ ముగ్గరి సినిమాల విషయానికి.. పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ ఓజీ సెప్టెంబర్ 25న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక రామ్ చర్మం ప్రస్తుతం దర్శకుడి బుచ్చిబాబు సనాతో పెద్ది సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చ్ 27న రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా విడుదల కానుంది. ఇక ఇటీవలే పుష్ప 2తో ఇండియన్ సినీ ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నీ బద్దలుకొట్టేసిన అల్లు అర్జున ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.