Shriya Saran: శ్రియ సెంటిమెంట్ తో మిరాయ్ బ్లాక్ బస్టర్.. ఒకటికాదు ఏకంగా రెండు!

పెళ్లి తరువాత చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తోంది నటి శ్రియ(Shriya Saran). ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకొని స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవించింది.

Shriya Saran: శ్రియ సెంటిమెంట్ తో మిరాయ్ బ్లాక్ బస్టర్.. ఒకటికాదు ఏకంగా రెండు!

Heroine Shriya Saran's sentiments are a plus for the movie Mirai

Updated On : September 9, 2025 / 10:57 AM IST

Shriya Saran: పెళ్లి తరువాత చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తోంది నటి శ్రియ. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్.. స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకొని స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవించింది. అయితే, క్రమంగా అవకాశాలు తగ్గడంలో పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లోకిఅడుగుపెట్టింది. కొంత గ్యాప్ తరువాత ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత కన్నడ కబ్జా అనే సినిమా సినిమా. ఇప్పుడు లేటెస్ట్ గా మిరాయ్ సినిమాలో హీరో తేజ సజ్జకు తల్లిగా నటిస్తోంది.

Bollywood: ఏంటి నిజమా.. ఈ స్టార్ హీరోకి సోషల్ మీడియా అకౌంట్స్ లేవా?

ట్రైలర్ చూస్తే ఈ సినిమాలో ఆమెకు చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ పడింది అన్నట్టుగా కనిపిస్తోంది. ఫాంటసీ ఎలిమెంట్స్ తో, భారీ గ్రాఫిక్స్ తో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 12న విడుదల కానుంది. కాబట్టి, ఈ సినిమా విజయం కోసం మేకర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమాకు శ్రియ(Shriya Saran) సెంటిమెంట్ చాలా వరకు కలిసొచ్చేలా కనిపిస్తోంది. అదేంటంటే.. శ్రియ హీరోయిన్ గా నటించిన బాలు, ఛత్రపతి రెండు సినిమాల్లో తేజ సజ్జ నటించారు. ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. ఇక సెప్టెంబర్ అనేది శ్రియకు కలిసొచ్చే నేలగా చెప్పుకోవచ్చు. ఈ నెలలో ఆమె హీరోయిన్ గా నటించిన ఠాగూర్, చెన్నకేశవరెడ్డి, ఛత్రపతి సినిమాలు విడుదల అయ్యాయి. ఈ మూడు సినిమాలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి.

అలా రెండు సెంటిమెంట్ లి మిరాయ్ సినిమాలో విషయంలో కలిసొచ్చేలా కనిపిస్తున్నాయి. కాబట్టి, ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందని మేకర్స్ ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. ఇక మిరాయ్ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటిస్తుండగా.. మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. రితిక నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది.