Bollywood: ఏంటి నిజమా.. ఈ స్టార్ హీరోకి సోషల్ మీడియా అకౌంట్స్ లేవా?
ప్రస్తుతం ప్రపంచం మొత్తం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతీ ఒక్కరూ సోషల్ (Bollywood)మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నారు.

Bollywood hero Ranbir Kapoor is not on social media.
Bollywood: ప్రస్తుతం ప్రపంచం మొత్తం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నారు. ఇక సినీ స్టార్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్ళ పర్సనల్ లైఫ్ నుండి(Bollywood) సినిమాల అప్డేట్స్ వరకు ప్రతీది సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆడియన్స్ తో టచ్ లో ఉంటూ ఉంటారు.
కానీ, ఒక స్టార్ హీరో మాత్రం ఇప్పటివరకు సోషల్ మీడియాను వాడలేదట. అసలు ఒక్క సోషల్ మీడియాలో కూడా ఆయనకు అకౌంట్ లేదట. ఆశ్చర్యంగా ఉంది కదా. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్. అవును, ఈ హీరోకి ఇన్ స్టా, ట్విట్టర్, పేస్ బుక్ ఇలా ఏ ఒక్క అకౌంట్ కూడా లేదట. కారణం ఏంటో తెలియదు కానీ, సోషల్ మీడియాకు ఆయన దూరంగా ఉంటారట. ఆయన సినిమాలకు సంబందించిన అప్డేట్స్ కూడా అయితే, ప్రొడక్షన్ కంపెనీ షేర్ చేయాలి లేదా ఆయన ఫ్యాన్స్ షేర్ చేయాలి కానీ, ఆయన నుంచి మాత్రం రాదు.
ప్రస్తుతం కాలంలో, ఇలా ఉండటం అనేది చాలా అరుదు. ప్రెజెంట్ సినీ ఇండస్ట్రీలో సోషల్ మీడియా అనేది చాలా పెద్ద ప్రమోషనల్ ఫ్యాక్టర్ గా మారిపోయింది. అయినప్పటికి రణబీర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అంటే నిజంగా గొప్ప విషయంగానే చెప్పుకోవాలి. ఇక రణబీర్ కపూర్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ రామాయణ సినిమా చేస్తున్నాడు. దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి సీతగా నటిస్తుండగా కన్నడ స్టార్ యష్ రావణాసురుడిగా కనిపించనున్నాడు. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.