Sanjay Dutt: జైలు జీవితం చాలా నేర్పింది.. ఆ వ్యక్తిని చూసినప్పుడు ఒళ్ళు జలదరించింది.. సంజయ్ దత్ కామెంట్స్ వైరల్

సంజయ్ దత్.. ఈ పేరు గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. తన నటనతో (Sanjay Dutt)బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్రను వేసుకున్నాడు ఈ హీరో.

Sanjay Dutt: జైలు జీవితం చాలా నేర్పింది.. ఆ వ్యక్తిని చూసినప్పుడు ఒళ్ళు జలదరించింది.. సంజయ్ దత్ కామెంట్స్ వైరల్

Hero Sanjay Dutt made interesting comments about his prison life

Updated On : September 9, 2025 / 9:29 AM IST

Sanjay Dutt: సంజయ్ దత్.. ఈ పేరు గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. తన నటనతో బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్రను వేసుకున్నాడు ఈ హీరో. వరుస విజయాలు అందుకొని స్టార్ స్టేటస్ కు చేరుకున్నాడు. కానీ, కొన్ని స్వీయ తప్పిదాల వల్ల జీవితాన్ని జైలు పాలు చేసుకున్నాడు. ముంబై బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్ జైలు శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే. అయితే, ఆ జీతం తనలో ఎన్నో మార్పులకు కారణం అయ్యిందట. ఈ విషయాన్ని స్వయంగా సంజయ్ దత్(Sanjay Dutt) ఆడియన్స్ తో పంచుకున్నారు. ఇటీవల ఆయన ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో పాల్గొన్నారు. తన జీతం ఎన్నో ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

Pawan-Charan-Bunny: ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు.. చూడటానికి ఎంత బాగుందో.. పవన్, చరణ్, బన్నీ ఫోటో వైరల్

నా జీవితంలో జరిగిన ఏది కూడా నాకు సంతృప్తిని ఇవ్వలేదు. నా తల్లి చనిపోయిన సంఘటన ఇప్పటికే మర్చిపోలేను. అది నన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఇక జైలులో గడిపిన క్షణాలను కష్టంగా భావించలేదు. ప్రతీ క్షణాన్ని ఎలా వినియోగించుకోలాని మాత్రమే ఆలోచించాను. జైలులో కార్పెంటర్ గా పని చేశాను. పేపర్ బ్యాగ్స్ తయారుచేసి డబ్బులు సంపాదించాను. అలాగే జైల్లో రేడియో స్టేషన్‌ను ప్రారంభించి ప్రోగ్రామ్స్ చేశాను.

ఇతర ఖైదీలతో కలిసి సామాజిక కార్యక్రమాలను కూడా నిర్వహించాను. అందుకే, నా వ్యక్తిగత అభివృద్ధి, మానసిక స్థిరత్వానికి జైలు ఎంతో నేర్పిందని చెప్పుకుంటాను. అలాగే రెండు హత్యలు చేసిన వ్యక్తి నాకు గడ్డం చేయడానికి వచ్చారు. అతను నా గుంతుపై కట్టి పెట్టి షేవ్ చేస్తుంటే ఒళ్ళు జలదరించింది అంటూ చెప్పుకొచ్చారు సంజయ్ దత్. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.