నా ఎదుగుదలను ఎవరూ అడ్డుకోలేరు : రకుల్‌ ప్రీత్‌సింగ్‌

  • Publish Date - March 23, 2019 / 05:11 AM IST

సినిమాలు ఎవరిని ఎప్పుడు ఉన్నత స్థాయికి తీసుకెలతాయో, ఎవరిని ఎప్పుడు కింద ప‌డేస్తాయే తెలియదు. ఇవాళ అవకాశాలు లేని వారు రేపు చేతినిండా చిత్రాలతో బిజీగా ఉండొచ్చు. నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది. ఈ అమ్మడు మొదట్లో కోలీవుడ్‌లో ఐరన్‌లెగ్‌గా ముద్ర వేసుకుంది. కానీ టాలీవుడ్‌లో సక్సెస్‌ అయ్యింది. వరుస పెట్టి యంగ్‌ స్టార్స్‌తో నటించేసింది. అంతే టాప్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ను తెచ్చుకుంది.
Read Also : మీకు మీరే సాటి : పాల్ చేష్ట‌లు – వ‌ర్మ సెటైర్లు

తాజాగా రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ను టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ ఫ్లాప్‌లు వెంటాడాయి. ముఖ్యంగా తమిళంలో కార్తీతో రెండోసారి రొమాన్స్‌ చేసిన దేవ్‌ చిత్ర ఫ్లాప్‌ ఆమె కెరీర్‌కు పెద్ద ఎఫెక్ట్‌ అయ్యింది. దీంతో కొత్త అవకాశాలేమీ దరిదాపులకు కూడా రావడం లేదు. ప్రస్తుతం సూర్య సరసన నటించిన ఎన్‌జీకే చిత్రం, శివకార్తికేయన్‌కు జంటగా నటిస్తున్న మరో చిత్రాలనే నమ్ముకుంది. అంతే కాదు టాలీవుడ్‌లో ఫ్లాప్‌ల కారణంగా అంగీకరించిన చిత్రాలు కూడా చేజారుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది.

అయితే దీని గురించి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ మాట్లాడుతు..తన గురించి ఎన్ని కట్టు కథలను ప్రచారం చేసినా తన ఎదుగుదలను ఎవరూ అడ్డుకోలేరని పేర్కొంది. మూడు భాషల్లో నటించే అతి కొద్ది మందిలో తాను ఒకరిని కావడం సంతోషంగా ఉందని.. తన ఎదుగుదలను అడ్డుకోవడానికి కొందరు సామాజిక మాధ్యమాల్లో వదంతులు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. అలాంటి తప్పుడు ప్రచారం గురించి పట్టించుకునే టైం నాకు లేదని ఈ అమ్మడు అందరికి క్లారిటీగా చెప్పింది. 
Read Also : రాజమండ్రిలో దీపిక ఓటుకు.. కాజల్ ఫొటో