Rakul Preet Singh Jackky Bhagnani Wedding will be in special way
Rakul Preet Singh : తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం బాలీవుడ్ లో కెరీర్ ని సాగిస్తూ వస్తున్నారు. అయితే అక్కడ బెటర్ ప్రొఫిషనల్ కెరీర్ ని సెట్ చేసుకోవడం కంటే పర్సనల్ కెరీర్ ని సెట్ చేసుకున్నారు. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో పడిన రకుల్.. కొన్నాళ్ళు రహస్య ప్రేమాయణం నడిపారు. ఆ తరువాత 2021లో ఆ ప్రేమని అందరికి తెలియజేసారు. ఇక ఇన్నాళ్లు ముంబైలో చెట్టపట్టాలు ఏసుకొని తిరిగిన ఈ జంట.. ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.
ఈ నెల 22న వీరి వివాహం జరగబోతున్నట్లు సమాచారం. ఇక ఈ వివాహం గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో జరగబోతుంది. ఇక ఈ పెళ్లిని పర్యావరణం పరిరక్షణ తగ్గట్టు చేసుకోబోతున్నారట. ఎకో ఫ్రెండ్లీ పద్ధతిలో పెళ్ళిలో పేపర్ వాడకం, అలాగే బాణాసంచా కాలచడం వంటివి దూరంగా పెడుతున్నారట. అంతేకాదు వివాహం జరిగిన తరువాత రోజు.. కొన్ని మొక్కలను నాటాలని కూడా నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం ఈ వార్తలు బాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి.
Also read : Rashmi Gautam : నా మీద కావాలని నెగిటివ్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు.. గుంటూరు కారం సినిమా వర్సెస్ రష్మీ..
మరి ఈ వార్తల్లో నిజమెంతో ఉందో తెలియదు గానీ, నెటిజెన్స్ మాత్రం.. ఈ నిర్ణయం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ని అసలు దుబాయ్ లేదా మాల్దీవ్స్ లో చేసుకోవాలని అనుకున్నారట. కానీ ఇటీవల మాల్దీవ్స్ ఇష్యూ అవ్వడం, ఆ తరువాత మన దేశ టూరిజం అభివృద్ధి గురించి ప్రతిఒక్కరు మాట్లాడటం చూసాక.. ఈ జంట గోవాలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట.
ఇక డెస్టినేషన్ వెడ్డింగ్ కి కేవలం ఫ్యామిలీ, పలువురు సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారట. ఆ తరువాత ముంబైలో ఓ గ్రాండ్ రిసెప్షన్ ని ఏర్పాటు చేయనున్నారట. ఆ పార్టీకి బాలీవుడ్ అండ్ టాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరుకానున్నారని సమాచారం.