×
Ad

Rakul Preet Singh : తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న రకుల్ ప్రీత్.. టీనేజ్‌లో ముంబైకి వెళ్లి..

రకుల్ ప్రీత్ సింగ్ తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఒక పోస్ట్ వేసింది. అలాగే..

  • Published On : September 29, 2023 / 09:46 PM IST

Rakul Preet Singh post on her career journey from his childhood dream

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి సౌత్ లోని పలు భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి అలరించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఉంటున్న ఈ భామ.. అక్కడే వరుస సినిమాలు చేస్తూ వస్తుంది. తాజాగా ఈ భామ తమ సినీ కెరీర్ ని గుర్తు చేసుకుంటూ ఒక పోస్ట్ వేసింది. అలాగే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తన ట్రాన్స్‌ఫార్మేషన్ తెలియజేసేలా కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది.

Chandramukhi 2 : చంద్రముఖి టీంకి రజినీకాంత్ లెటర్.. ఏం రాశాడో తెలుసా..?

“నా చిన్న వయసులోనే పెద్ద స్క్రీన్ పైకి రావాలని కలలు కన్నాను. అప్పుడు నాకు ఈ ఇండస్ట్రీ గురించి ఏమి తెలియదు. కానీ నమ్మకంతో ప్రయాణించి మోడల్‌గా, మిస్ ఇండియాగా, హీరోయిన్‌గా ఎదిగాను. ఈ జర్నీలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. టీనేజ్ లో ముంబైకి వెళ్లి అక్కడ ఒంటరిగా ఉండడం ఎంతో కష్టం. ఎన్నో ఆడిషన్స్, సెలక్షన్ అయ్యిన తరువాత కూడా ఛాన్సులు మిస్ అవ్వడం, ఫైనల్ గా మీ హృదయాల్లో స్థానం.. మొత్తం ఒక అందమైన జర్నీ. ఈ ప్రయాణంలో నేను నమ్ముకున్నది.. ఆత్మవిశ్వాసం, కష్టపడి పని చేయడం. అవే నేడు నా కలలను నిజం చేశాయి” అంటూ పేర్కొంది.

Vijay Antony : కూతురు మరణం నుంచి కోలుకుంటున్న విజయ్ ఆంటోనీ.. పాన్ ఇండియా మూవీతో..

ఈ మొత్తం జర్నీ తన ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా జరిగేది కాదని, వాళ్ళు తన పై ఎంతో ప్రేమ చూపించారంటూ వెల్లడించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. కాగా రకుల్ ఇప్పుడు ఈ పోస్ట్ ఎందుకు వేసిందంటే.. బాలీవుడ్ లో ‘థాంక్యూ ఫర్ కమింగ్’ అనే మూవీ రిలీజ్ అవుతుంది. ఆ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక సోషల్ మీడియా ఛాలెంజ్ ని స్టార్ట్ చేశారు. ఈ ఛాలెంజ్ లో తమ స్టోరీని తెలియజేయాలి. థాంక్యూ ఫర్ కమింగ్ మూవీలో నటిస్తున్న ‘భూమి పెడ్నేకర్’ ఈ ఛాలెంజ్ ని రకుల్ కి ఇచ్చింది.