Ram Charan : రామ్‌చ‌ర‌ణ్ క్రేజ్ మామూలుగా లేదుగా.. స‌చిన్‌, అక్ష‌య్‌, సూర్య‌ల‌తో క‌లిసి ‘నాటు నాటు’ స్టెప్పు

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది.

Ram Charan Akshay Kumar Sachin Tendulkar Suriya dance to Naatu Naatu

Ram Charan – Naatu Naatu : మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఆయ‌న న‌టించిన సినిమాల కోసం ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో గేమ్ ఛేంజ‌ర్ సినిమాలో న‌టిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ త‌రువాత రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న సినిమా కావ‌డంతో అంద‌రి చూపు ఈ మూవీపైనే ఉంది. కాగా.. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ రాజ‌కీయ నాయకుడిగా క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. క్రికెట్ లీగ్‌లోకి చ‌ర‌ణ్ ఇప్ప‌టికే అడుగుపెట్టారు. ఇండియా స్ట్రీట్ సూపర్ లీగ్ టోర్నీలో ఆయ‌న హైద‌రాబాద్ జ‌ట్టును కొనుగోలు చేసిన సంగ‌తి తెలిసిందే. టెన్నిస్ బాల్‌తో ఈ టోర్నీని నిర్వ‌హించ‌నున్నారు. కాగా.. ఇండియా స్ట్రీట్ సూపర్ లీగ్ 2024 ఆరంభ వేడుక‌లు బుధ‌వారం థానేలో ఘ‌నంగా జ‌రిగాయి. దడోజి కోనదేవ్ స్టేడియంలో జ‌రిగిన ఈ వేడుల‌క‌లో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్‌, టీమ్ఇండియా మాజీ కోచ్ ర‌విశాస్త్రి, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య‌, బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్‌ లు పాల్గొన్నారు.

Sharwanand : శర్వానంద్ బర్త్ డే అప్డేట్స్.. మూడు సినిమాలు మూడు డిఫరెంట్ రోల్స్..

ఈ క్ర‌మంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట‌కు స‌చిన్‌, సూర్య‌, బాలీవుడ్ హీరో అక్ష‌య్‌కుమార్ క‌లిసి చ‌ర‌ణ్‌ స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అంతేకాదండోయ్ చీర్ లీడ‌ర్స్‌తో క‌లిసి చ‌ర‌ణ్ డ్యాన్స్ చేశారు.

కాగా.. టెన్నిస్ బాల్‌తో జరిగే ఈ టీ10 క్రికెట్ లీగ్‌లో భారత స్టార్ హీరోలంతా భాగమయ్యారు. నేటి నుంచి మార్చి 15 వరకు ఈ టోర్నీ జ‌ర‌గ‌నుంది. మొత్తం 6 జ‌ట్లు ఇందులో పోటీప‌డ‌నున్నాయి. మాజీ ముంబై, శ్రీనగర్ కే వీర్, ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సింగమ్స్, బెంగళూరు స్ట్రైకర్స్, టైగర్స్ ఆఫ్ కోల్‌కతా జట్లు క‌ప్పుకోసం త‌ల‌ప‌డ‌నున్నాయి. మాజీ ముంబై ఫ్రాంచైజీని అమితాబ్ బచ్చన్, చెన్నై సింగమ్స్‌ను సూర్య శివకుమార్, బెంగళూరు స్ట్రైకర్స్ హృతిక్ రోషన్, టైగర్స్ ఆఫ్ కోల్‌కతా జట్టును సైఫ్ అలీఖాన్-కరీనా కపూర్‌, ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును రామ్ చరణ్ కొనుగోలు చేశారు.

ట్రెండింగ్ వార్తలు