Tollywood Stars : స్టార్ పేర్లు మార్చుకుంటున్న హీరోలు.. మొన్న అల్లు అర్జున్, నిన్న ఎన్టీఆర్, నేడు రామ్ చరణ్..

ఇటీవల వరుసగా ముగ్గురు స్టార్ హీరోలు తమ పేర్లకు ముందు ఉన్న ట్యాగ్స్ మార్చుకున్నారు.

Tollywood Stars : మన హీరోలందరికీ పేరు ముందు ఏదో ఒక ట్యాగ్ ఉండాల్సిందే. ఏదో ఒక స్టార్ పేరుతో అభిమానులు తమ హీరోని పిలుచుకుంటారు. ఒకప్పుడు స్టార్ హీరోలకు మాత్రమే వేసుకునే ట్యాగ్ ఇప్పుడు చిన్నా పెద్దా ప్రతి హీరోకి తమ పేరు ముందు ఏదో ఒక ట్యాగ్ వేసుకుంటున్నారు. ఇక కొంతమంది హీరోలు తమ పేరు ముందు ఉండే ట్యాగ్స్ ని కూడా మార్చుకుంటారు. హీరోలు స్వతహాగా మార్చుకోకపోయినా అభిమానులు, హీరో చుట్టుపక్కల ఉండే వాళ్ళు మార్చేస్తారు. గతంలో చాలా మంది హీరోలు తమ పేరు ముందు ఉన్న ట్యాగ్స్ ని మార్చుకున్నారు. ఇటీవల వరుసగా ముగ్గురు స్టార్ హీరోలు తమ పేర్లకు ముందు ఉన్న ట్యాగ్స్ మార్చుకున్నారు.

పుష్ప సినిమా రిలీజ్ కి ముందు అల్లు అర్జున్(Allu Arjun) కి స్టైలిష్ స్టార్ అని ఉంటే దాన్ని ఐకాన్ స్టార్ గా మార్చుకున్నాడు. ఈ ట్యాగ్ పుష్ప దర్శకుడు సుకుమార్ ఇవ్వడం గమనార్హం. దీంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాస్తా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయ్యాడు.

ఇక RRR సినిమాతో ప్రపంచమంతా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్(NTR), చరణ్(Ram Charan) లు కూడా తమ ట్యాగ్స్ ని మార్చుకున్నారు. ఎన్టీఆర్ కి గతంలో A1 స్టార్, యంగ్ టైగర్ అనే ట్యాగ్స్ ఉండేవి. ఇప్పుడు అభిమానులు మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే టైటిల్ ఇవ్వడంతో దేవర సినిమా పోస్టర్స్ లో అధికారికంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అనే వేస్తున్నారు.

Also Read : Mahesh Babu : మళ్ళీ ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కి మహేష్.. రాజమౌళి సినిమా ఇంకెప్పుడు అంటూ ఫ్యాన్స్..

ఇక రామ చరణ్ కి ముందు నుంచి మెగా పవర్ స్టార్ అని ఉండేది. RRR సినిమాతో గ్లోబల్ వైడ్ రీచ్ తెచ్చుకోవడంతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అని అభిమానులు పిలుస్తున్నారు. తాజాగా RC16 సినిమా పూజా కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్ వీడియో రిలీజ్ చేయగా అందులో చరణ్ పేరుకి ముందు గ్లోబల్ స్టార్ అని అధికారికంగా వేశారు. దీంతో ఇకపై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అనే సినిమాల్లో టైటిల్ పడుతుందని సమాచారం. దీంతో అభిమానులు కూడా ఈ ట్యాగ్స్ తో తమ హీరోలని పిలుచుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు